గద్వాల, ఆగస్టు 5 : బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కక్ష సాధింపు చర్యల్లో భాగమే కాళేశ్వరం కమిషన్ నివేదిక అని బీఆర్ఎస్ గద్వా ల నియోజకవర్గ నాయకుడు బాసుహన్మంతునాయుడు ఆరోపించారు. మం గళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి హరీశ్‌రావు హైదరకాబాద్ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాం గ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన ఎదుర్కోనేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. కాళేశ్వరం కమిషన్‌పై అబద్ధపు ప్రచారాలు నిర్వహిస్తూ, ఇచ్చి న హామీలు అమలు చేయక కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందని విమర్శించారు. కాళేశ్వరంపై కమీషన్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కుం డలు బద్దలు కొట్టారని ఆయన చెప్పా రు. ఒక్క అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చడానికి వెయ్యి అబద్ధాలు ఆడాల్సి వస్తుందన్న పెద్దల మాటలను కాంగ్రెస్ వాళ్లు నిజం చేస్తున్నారని అన్నారు.
కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అం టూ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు పనికిమాలిన అబద్ధం ఒకటి చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ అబద్ధం నిజమని నిరూపించేందుకు ఇప్పుడు వంద అబద్దాలు ఆడుతున్నారని కాంగ్రెస్‌పై ఆయ న మండిపడ్డారు. కాళేశ్వరంపై మీరు ఎన్ని కమిషన్లు వేసినా.. మీరెంత విచారణ చేసినా, మీరు ఎన్ని వందల రిపోర్టులు బయట పెట్టిన ఎదుర్కోనేందుకు తమ నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 60 ఏండ్ల మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యం కాని పనిని కేవలం మూడేండ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి తడారిని మడుల్లో నీళ్లు తడిపిన నాయకుడు కేసీఆర్ అన్నా రు. మీరు ఎన్ని అబద్ధపు పేజీలు బయట పెట్టినా ఈ నిజాన్ని చెరిపేయలేరని పేర్కోన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, చక్రధర్‌రావు, రాఘవేంద్రరెడ్డి, అంగడి బస్వరాజ్, కుర్వ పల్లయ్య, అతుకూరీ రెహమాన్, శేఖర్, మోనేష్, రాజు, బీచుపల్లి, జనార్దన్‌రెడ్డి, రా ము, రాజు, మక్బూల్, మహదేవప్ప, చక్రధర్‌రెడ్డి, గోవర్ధన్, వెంకటేశ్నాయుడు తదిత రులు పాల్గొన్నారు.