మహబూబ్‌నగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మెజారిటీ పంచాయతీ స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగడంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను ఆయా గ్రామ కమిటీలకే వదిలేసి నేతలను కార్యకర్తలను సమన్వయం చేసి గెలుపు గుర్రాలకి అవకాశాలు కల్పించారు. ఎక్కడా ఎలాంటి అసంతృప్తి లేకుండా పార్టీ నేతలను ఏకతాటిపై తీసుకురావడంతో సఫలమయ్యారు.
అధికార పార్టీకి దీటుగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. తొలి విడుత పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పోటీలో ఉన్న అభ్యర్థులంతా గ్రామ అభివృద్ధికి పాటు పడతామని హామీలు గుప్పిస్తున్నారు. మరికొందరు సొంత డబ్బులు పెట్టి గుళ్లు గోపురాలతోపాటు ఇతరత్రా వాటికి ఖర్చు చేస్తామని వాగ్దానాలు గుప్పిస్తున్నారు. కొన్నిచోట్లా విద్యావంతులు కూడా పోటీకి దిగడంతో పంచాయతీ పోరు ఊపందుకుంది. ఇప్పటికే ఏకగ్రీవాలుగా నిలిచిన పంచాయతీల్లో గెలుపొందిన అభ్యర్థులు రూ.లక్షలకు లక్షలు గ్రామ అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రకటించి పోటీ లేకుండా చూసుకున్నారు.
మరికొన్నిచోట్లా ఏకంగా వేలం పాటలు పాడి సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. ఈనెల 11న తొలి విడుత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తుండడంతో ఆయా గ్రామాల్లో ప్రచారం తారస్థాయికి చేరుకుంది. అభ్యర్థుల తమకు కేటాయించిన గుర్తులతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలివిడుత మొత్తం 550 సర్పంచ్ స్థానాలకు 4,840 వార్డులకు ఈనెల 11న ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 58 సర్పంచ్ స్థానాలు.. 1,120 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి విడుత పంచాయతీ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతుంది. ఈ మేరకు దీటైనా అభ్యర్థులను రంగంలోకి దింపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి మద్దతు ఇస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకారం అందిస్తున్నారు. జిల్లా మండల పార్టీ గ్రామ పార్టీ నేతలకు వార్డులు గ్రామ పంచాయతీలకు ఇన్చార్జిగా నియమించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాడు. బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల వేళ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు నాయకులు చేరుతున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాల్లో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, గద్వాల ఇన్చార్జి బాసుహనుమంతునాయుడు సమక్షంలో ఇతర పార్టీల నాయకులు పార్టీలోకి చేరుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమకు సరైన అవకాశం ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ చాలామంది కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన క్యాండిడేట్లకు ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కలిసి వచ్చే అం శంగా మారింది. పంచాయతీ ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి చేరుతుండడంతో అధికార పార్టీ నాయకులు కంగు తింటున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 11న తొలి విడుత ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాలో 492 స్థానాలకు 1669 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 3, 720 వార్డులకు గానూ 8,944 మంది పోటీ పడుతున్నారు. చాలా గ్రామపంచాయతీలో త్రిముఖ పోరు నెలకొన్నది. సర్పంచ్ పదవులకు ఎన్నో ఆశలు పెట్టుకున్న తమను కాదని పార్టీలు ఇతరులకు మద్దతు ఇవ్వడంతో కొంతమంది రెబల్స్‌గా రంగంలోకి దిగా రు. ఇక గెలిచినవారు ఎవరైనా లాగేందుకు ఆయా పార్టీలు కండువాలు కప్పేందుకు సిద్ధమవుతున్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పంచాయతీ ఎ న్నికల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో అధికార యంత్రాంగం పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేస్తున్న ది. ఇప్పటికే వివిధ స్థాయి సిబ్బందికి ఎన్నికల శిక్షణను ఇస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వర కు జరిగే ప్రక్రియ కోసం ఎలా నిర్వహించాలని దాని పై పూర్తిస్థాయి శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటికే క్యాం డిడెట్లకు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు కూడా ము ద్రించడంతో ఎన్నికల ఫలితాలు అదే రోజు ప్రకటించాల్సి వస్తుండడంతో కలెక్టర్లు దగ్గరుండి అన్ని ఏర్పా ట్లు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ప్రతి జిల్లాకు ఎన్నికల ప్రత్యేక అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. వీరంతా ఆయా చోట్లా పరిశీలన జరిపి సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్నారు. ఇక పో లిం గ్ దగ్గర పడుతుండడం ప్రచారంలో ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా జిల్లా ఎ స్పీల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పా టు చేస్తున్నారు. పోలింగ్ రోజు అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా చూస్తున్నారు.