మద్దూర్(కొత్తపల్లి), అక్టోబర్ 11 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండల పరిధిలోని కొత్తపల్లి తండాకు చెందిన వివిధ పార్టీల నాయకులు శనివారం పట్నం నరేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని సుభిక్షంగా మార్చారని తెలిపారు.
రెండేండ్ల పాలనలో రేవంత్‌రెడ్డి చేతగాని పాలన ప్రజలకు అర్థమైపోయిందన్నారు. కూల్చడాలు తప్పా కట్టడాలు సాధ్యం కాదని నిరూపితమైందన్నారు. పరిపాలన చేతగాక ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తూ పబ్బం గడపాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అన్నిరంగాల్లో విఫలమైన కాంగ్రెస్ పరిపాలనను వద్దనుకొనే ప్రజలంతా కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి ప్రతి పల్లెలో గులాబీ జెండా ను ఎగరవేయాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మల్లేశ్, రాజారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మణెప్ప, అ ల్లిరాజు పాల్గొన్నారు.