మహబూబ్‌నగర్ టౌన్, జనవరి 11 : మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పీఠాన్ని అధికార కాంగ్రెస్ చేజిక్కించుకునేందుకు ప్రయత్నా లు చేస్తుండగా, బీఆర్ఎస్ అడ్డుకునేందుకు ప్ర ణాళికలు రచిస్తున్నది. పురపాలక చైర్మన్ పదవి కైవసం చేసుకునేందుకు కావాల్సిన మెజార్టీ కౌ న్సిలర్లను తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైంది. బీఆర్ఎస్ పార్టీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల బృందం సంతకాలతో కూడిన పత్రాన్ని కలెక్టర్‌కు అందజేసిన విష యం తెలిసిందే. కలెక్టర్ త్వరలో నోటీసు లు జారీ చేసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పురపాలికకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఈనెల 27న మున్సిపాలిటీ సమావేశం నిర్వహించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 49 మంది కౌన్సిలర్ స్థానాలకు 2019లో బీఆర్ఎస్ పార్టీ పురపాలక పీఠాన్ని కైవసం చేసుకున్నది. పురపాలక చైర్మన్‌గా 2వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన కేసీ నర్సింహులు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 30, కాంగ్రెస్ 5, బీజేపీ 5, ఎంఐఎం 3, స్వతంత్ర అభ్యర్థులు ఆరుగురు గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ నుంచి నలుగురు, బీజేపీ నుంచి ఇద్దరు, స్వతంత్రులు ఆరుగురు బీఆర్ఎస్లో చేరడంతో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బలం 42మంది కౌన్సిలర్ల వరకు చేరుకున్నది. ఎంఐఎం సభ్యులు సైతం బీఆర్ఎస్కే మద్దతుగా ఉన్నారు.
మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ కుమార్‌గౌడ్ నేతృత్వంలో పురపాలక పీఠం కైవసం చేసుకునేందుకు సీనియర్ నాయకులు ఎన్పీ వెంకటేశ్, సురేందర్‌రెడ్డి పావులు కదిపారు. జనవరి 6వ తేదీన కలెక్టర్‌కు 32 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన పత్రాన్ని సమర్పించి పురపాలక చైర్మన్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ 20, కాంగ్రెస్ 5, బీజేపీ 3, ఎంఐఎం 4 మొత్తం 32మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భం గా బీఆర్ఎస్ పార్టీ బీ ఫారంపై విజయం సాధించిన నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు మద్దతు గా ప్రచారం నిర్వహించారని, వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు జనవరి 8న హైకోర్టును ఆశ్రయించారు. ఈ నలుగురు కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయాలని కోరారు. నలుగురు కౌన్సిలర్లను అనర్హులుగా తేల్చితే చైర్మన్ పదవిపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉండదని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన పలువురిపై అనర్హత వేటు వేయాలని కోర్టును ఆశ్రయించడంతో కౌన్సిలర్లలో ఆందోళన నెలకొన్న ది. ఒక వేళ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎలాగని మదనపడుతున్నారు. మరికొందరు అనవసరంగా కాంగ్రెస్ అవిశ్వాసానికి మద్దతుగా నిలిచామా అని భయాందోళనకు గురవుతున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ వార్డు నాయకులు కొంద రు బీఆర్ఎస్ కౌన్సిలర్లను పార్టీలోకి తీసుకోవద్దని పార్టీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశా రు. పదేండ్లు ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్పై పోరాడిన తమకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని భావించామని, మళ్లీ బీఆర్ఎస్ నా యకులను పార్టీలో చేర్చుకుంటే తమ భవిష్య త్తు ఏమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.