Home
Mahabubnagar
Bridge Construction Using Illegal Sand Contractor Causing Revenue Loss To The Government
Illegal sand | అక్రమ ఇసుకతో బ్రిడ్జి నిర్మాణం.. ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్న కాంట్రాక్టర్
Illegal sand | నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా జరుగుతుంది.
మాగనూరు : నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో అక్రమ ఇసుక ( Illegal sand ) జోరుగా రవాణా జరుగుతుంది. ఇసుక రవాణాకు అనుమతులు లేకుండానే బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మండలంలోని మందిపల్లి వాగు- చిట్యాల మధ్యలో సుమారు రూ. 22 కోట్లతో బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. అయితే బ్రిడ్జి ( Bridge ) నిర్మాణానికి అక్రమంగా ఇసుక డంపులు చేపట్టి వాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కోట్ల నిర్మాణంతో చేపట్టే పనులకు ఇసుకను కొనుగోలు చేయకుండా అక్రమంగా డంపు చేసుకొని ప్రభుత్వ ఆదాయానికి లక్షల రూపాయలు గండి కొడుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అక్రమంగా ఇసుక డంపులను సీజ్ చేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో మాగనూరు తహసీల్దార్ మహమ్మద్ రహిమాన్‌కు వివరణ కోరగా బ్రిడ్జి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక కోసం కాంట్రాక్టర్ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వెల్లడించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

