మాగనూర్, జూన్ 17: తెలంగాణలోని గ్రామాలలో అమలవుతున్న పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని వేనని బీజేపీ రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి శంకరోల్ల రవికుమార్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 11 ఏండ్ల కాలంలో గ్రామస్థాయిలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. మంగళవారం మాగనూరు (Maganoor) మండలంలోని కొత్తపల్లిలో నిర్వహించిన రచ్చబండ కార్యాక్రమంలో రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు ఉజ్వల పథకం కింద సిలిండర్లు, మహిళల ఆత్మగౌరవం కాపాడే విధంగా మరుగుదొడ్ల నిర్మాణం, పుట్టిన బిడ్డకు సుకన్య సమృద్ధి యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ, రైతుల సుభిక్షం కోసం కిసాన్ సామ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.12 వేలు అదేవిధంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర ఇస్తున్నామని చెప్పారు.
అదేవిధంగా రైతులకు 50 శాతం సబ్సిడీ కింద యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కోసం సీసీ రోడ్లు అదేవిధంగా స్ట్రీట్ లైట్లు గ్రామాల్లో గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో అనేకమందికి పని కల్పించి వారికి జీవనోపాధి కల్పించామని, రహదారుల నిర్మాణం వంటి కార్యక్రమాలు ఈ 11 ఏండ్ల కాలంలో నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధిని గడపగడపకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ బీజేపీని బలపర్చాలన్నారు.
బీజేపీ కృష్ణ, ఉమ్మడి మండల అధ్యక్షుడు నల్లే నర్సప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సోమశేఖర్ గౌడ్, మండల మాజీ అధ్యక్షుడు జయానంద రెడ్డి, నారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కనకరాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు వాకిటి మల్లేష్, స్థానిక తాజా మాజీ సర్పంచ్ కొత్తపల్లి తిమ్మప్ప, అంజప్ప గౌడ, సీనియర్ నాయకులు లోకపల్లి హనుమంతు, సోమప్ప గౌడ, ప్రధాన కార్యదర్శి దండు రాఘవేంద్ర, అశోక్ గౌడ్, డాక్టర్ కృష్ణయ్య, భరత్ కుమార్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్, భూత్ అధ్యక్షుడు అశోక్, భీమప్ప, సీనియర్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.