మాటలు చెప్పే నాయకులను నమ్మొద్దు
మాటలు చెప్పే నాయకులకు నమ్మకుండా అభివృద్ధి చేసే వారికి ఓటు వేసి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని దమగ్నాపూర్‌లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బుధవారం భూమిపూజ చేశారు.
- అభివృద్ధి చేసే వారికే పట్టం కట్టాలి
- కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
- జీపీ భవన నిర్మాణానికి భూమిపూజ
మద్దూర్ (కొత్తపల్లి), ఫిబ్రవరి1: మాటలు చెప్పే నాయకులకు నమ్మకుండా అభివృద్ధి చేసే వారికి ఓటు వేసి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని దమగ్నాపూర్‌లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.20లక్షలతో భవనాన్ని నాణ్యతతో నిర్మించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తండాలను సైతం జీపీలుగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వీరారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సి.వెంకటయ్య, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రక్తదానం..ప్రాణదానం
కోస్గి, ఫిబ్రవరి 1: రక్తదానం ప్రాణదానంతో సమానమని కొడంగల్ ఎమ్మె ల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. పోలేపల్లిలో ఎస్వీఎస్ దవాఖాన వారు బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఆపదలో ఉన్నవారికి కష్టకాలంలో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని సూచించారు. అ నంతరం పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకున్నారు. 10వ తేదీన నిర్వహించే ఎల్లమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆలయ ఈవో రాజేందర్‌రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

