ఆస్పత్రిని కమ్మేసిన చీకట్లు
శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖాన అంధకారంతో నిండుకుంది. వారం రోజులుగా కరెంట్ లేకపోవడంతో దవాఖానలో చేరిన బాధితుల ఆక్రందనలకు నిలయంగా మారింది. కేసీఆర్ హయాంలో ప్రైవేట్ దవాఖానలకు దీటుగా రూపుదిద్దుకున్న ప్రభుత్వ దవాఖానలు.. నేడు రేవంత్‌రెడ్డి పాలనలో కరెంట్ లేక అంధకారంలోకి జారుకుంటున్నాయి.
- రంగారెడ్డి జిల్లా దవాఖానలో వారం రోజులుగా కరెంట్ కట్
- సెల్‌ఫోన్ కాంతుల్లోనే ప్రసవాలు, శస్త్ర చికిత్సలు
- అవస్థలు పడుతున్న రోగులు, వైద్య సిబ్బంది
- బీఆర్ఎస్ నేతల ఆస్పత్రి సందర్శన
- ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని మండిపాటు
కొండాపూర్, ఆగస్టు 14 : శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖాన అంధకారంతో నిండుకుంది. వారం రోజులుగా కరెంట్ లేకపోవడంతో దవాఖానలో చేరిన బాధితుల ఆక్రందనలకు నిలయంగా మారింది. కేసీఆర్ హయాంలో ప్రైవేట్ దవాఖానలకు దీటుగా రూపుదిద్దుకున్న ప్రభుత్వ దవాఖానలు.. నేడు రేవంత్‌రెడ్డి పాలనలో కరెంట్ లేక అంధకారంలోకి జారుకుంటున్నాయి.
వారం రోజులుగా దవఖానను తీవ్ర విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. ఆస్పత్రిలోని అత్యవసర విభాగాలు, ప్రసవ వార్డుల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో గర్భిణులు, ప్రాణాంతక స్థితిలో ఉన్న రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. వైద్యాధికారులు, సిబ్బంది ప్రసవాలు చేయడానికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి చికిత్స అందించడానికి సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్లు, టార్చ్ లైట్లను వినియోగిస్తుండటం ఇకడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
పడకేసిన పారిశుధ్యం..
విద్యుత్ సమస్యతో పాటు ఆస్పత్రిలో పారిశుధ్యం పడకేసింది. కనీసం మరుగుదొడ్ల సౌకర్యం లేక రోగులు, వారి బంధువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రాంగణమంతా చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. పారిశుధ్య వైఫల్యం కారణంగా నవజాత శిశువులు, బలహీనంగా ఉన్న రోగులు కొత్త రోగాల బారిన పడే ప్రమాదం నెలకొంది.
దవాఖానను సందర్శించిన బీఆర్ఎస్ నేతలు
ప్రజలు, రోగుల నుంచి వచ్చిన వరుస ఫిర్యాదులతో స్పందించిన కొండాపూర్ బీఆర్ఎస్ నాయకులు.. మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్, నవతారెడ్డి, రవి యాదవ్, నరేందర్ యాదవ్, మమత, మల్లారెడ్డి, విజయ్ భాస్కర్‌రెడ్డి అర్ధరాత్రి వేళ దవఖానను సందర్శించి, బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక జిల్లాస్థాయి ఆస్పత్రిలో ఇంతటి దారుణ పరిస్థితులు ఉండటం సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ఆస్పత్రి అధికారులు, ప్రభుత్వం నవజాత శిశువులు, రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో తక్షణమే నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ సౌకర్యం, నీటి వసతి, పారిశుధ్యాన్ని పునరుద్ధరించాలి.
4 రోజులుగా పారాసిటమాల్ పైనే..
గత 4 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఒక బాధితుడు మాట్లాడుతూ.. జగద్గిరిగుట్ట బస్తీ దవాఖానా నుంచి కొండాపూర్ ఆస్పత్రికి పంపారని తెలిపారు. అత్యవసరంగా రక్త పరీక్షలు రాస్తే, ల్యాబ్‌లో గత 4 రోజులుగా కరెంట్ లేకపోవడంతో పరీక్షలు చేయడం లేదని సిబ్బంది రేపటికి వాయిదా వేశారు. మంచినీళ్ల సౌకర్యం కూడా లేకపోవడంతో కేవలం పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటూ అల్లాడిపోతున్నానని వాపోయారు.
స్ట్రెచర్ పై బకెట్లతో నీళ్ల మోత..
దవఖానలో వారం రోజులుగా విద్యుత్ లేకపోవడంతో మోటార్లు నడవక నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. బకెట్లలో నీటిని నింపి, ఆ బకెట్లను స్ట్రెచర్లపై పెట్టుకుని మోసుకెళ్లాల్సిన పరిస్థితి దవఖాన సిబ్బందికి దాపురించింది. గత ప్రభుత్వ హయాంలో దవఖాన రూపురేఖలను పూర్తిగా మార్చిన ఘనత కేసీఆర్‌కు దక్కితే.. అదే దవఖానను మరో పాతికేండ్లు వెనక్కి తీసుకెళ్లిన ఘనత ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కుతుందని దవఖానలో చికిత్స పొందుతున్న రోగులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

