ఈ ఏడాది ‘పెద్ది’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన అగ్ర హీరో రామ్‌చరణ్ ప్రస్తుతం తన తదుపరి సినిమా సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. నవంబర్‌లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. రంగస్థలం, పుష్ప ఫ్రాంఛైజీ చిత్రాల్లో రూరల్ బ్యాక్‌డ్రాప్ కథాంశాల్ని ఎంచుకున్న దర్శకుడు సుకుమార్ ఈసారి పంథా మార్చారని, రామ్‌చరణ్ సినిమా కోసం అర్బన్ నేపథ్య కథను సిద్ధం చేశారని వార్తలొస్తున్నాయి. ఇందులో రామ్‌చరణ్ క్యారెక్టరైజేషన్ యూనిక్‌గా ఉంటుందని, ముఖ్యంగా ఆయన లుక్స్ అల్ట్రా ైస్టెలిష్‌గా ఉంటాయని చెబుతున్నారు.
ఈ సినిమాలో రామ్‌చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తారని, దాదాపు 15 కిలోల బరువు తగ్గి మరింత స్లిమ్‌గా తయారుకాబోతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఇప్పటికే ఆ దిశగా ఆయన కసరత్తులు ప్రారంభించారని, రామ్‌చరణ్ మేకోవర్ అభిమానుల్ని సర్ప్రైజ్ చేస్తుందని చెబుతున్నారు. ‘ఆర్సీ17’వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కించబోతున్నాయి.