Ala Venkateshwar Reddy | మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు నర్సింగపూర్, శేర్పల్లిలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సహకారంతో నర్సింగపూర్కు బీటీ రోడ్డు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించాం.. కేసీఆర్ సహకారంతో భూత్పూర్ మున్సిపాలిటీగా చేసుకొని 50 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామన్నారు. మున్సిపల్ పరిధిలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేసి నిర్మించామన్నారు.
కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చెర్మెన్ వాల్యా నాయక్, బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు, పాల్గొన్నారు.
