కొత్తగూడెం టౌన్, జూలై 24 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్ ) పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం సుజాతనగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. దేశంలోని నిరుద్యోగులు, విద్యార్థులపైన కేంద్ర ప్రభుత్వం చేసే అన్యాయపు దాడులకు నిరసన తెలియచేస్తూ విద్యార్థిని, విద్యార్థులకి తమ పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సుజాతనగర్ మండల అధ్యక్షుడు లావుడియా సత్యనారాయణ, చింతలపూడి జగన్, పెద్దమల్ల నరేంద్ర, కార్తీక్, కృష్ణ, చంటి, ప్రదీప్, బాబా, రహీం, సాజిద్, రాజేష్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.

సుజాతనగర్ పీహెచ్సీలో రోగులకు పండ్లు పంపిణీ