ఓటుహక్కు ప్రజాస్వామ్యానికి రక్ష
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని మొలచింతలపల్లి గ్రామంలో ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై సర్పంచ్ వరలక్ష్మి, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
- కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
కొల్లాపూర్, జూన్ 26 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని మొలచింతలపల్లి గ్రామంలో ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై సర్పంచ్ వరలక్ష్మి, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన యువత విధిగా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, పేర్ల మార్పులు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను గ్రామంలోని ప్రతి ఒక్కరికీ వివరించాలన్నారు. అర్హులు ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అదేవిధంగా, గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచే పార్టీ అని, తెలంగాణ ప్రగతికి, కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి పునాది వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు, ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్క కార్యకర్త భా గస్వాములు కావాలన్నారు. అలాగే గ్రామంలో స్థానిక సమస్యలపై ప్రజలతో ముఖాముఖిగా చర్చించారు. కార్యక్రమంలో స్థానిక, మండల బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

