పాన్‌గల్, సెప్టెంబర్ 1 : మండలంలోని కేతేపల్లి గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కేతేపల్లి గ్రామాన్ని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సందర్శించి ఇటీవల రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులతో మాట్లాడారు.
విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ మొదటి విడుతలోనే మం జూరు చేస్తామని చెప్పి ప్రస్తుతం మాట తప్పడం సరికాదన్నారు. బాధితులను ఏ మాత్రం పట్టించుకోవడం బాధాకమన్నారు. అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే మొదలు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరసాగర్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయక్, అడ్వకేట్ రవికుమార్, రాజేశ్‌రెడ్డి, రంగాపురం శివారెడ్డి, తిలక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.