పెద్దకొత్తపల్లి, ఫిబ్రవరి 25 : భవిష్యత్ బీఆర్ఎస్దేనని కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడవద్దని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి భరోసా ఇచ్చా రు. మంగళవారం ఆయన పెద్ద కొత్తపల్లి మండలకేంద్రం లో కార్యకర్తలతో సరదాగా గడిపారు. అయితే కొల్లాపూర్ ప్రాంతంలో దాడులు పెరిగాయని, నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని మండల నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బీరం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చేయలేక కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమాలకు కోతలు పెడుతున్నదని ఆరోపించారు.
ముఖ్యంగా ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, కా ర్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తుందని, అంత మాత్రా నా ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అంత వరకు ఓపిక పట్టాలన్నా రు. అనంతరం కార్యకర్తలు, నాయకులను సీరియస్ మూ డ్ నుంచి బయటకు తీసుకొని వచ్చేందుకు వారితో కలిసి కొద్దిదూరం నడుచుకుంటూ వచ్చి ఓ టీస్టాల్ వద్ద అందరితో కలిసి టీ తాగి కాసేపు సరదాగా ముచ్చటించారు. మాజీ ఎమ్మెల్యే ఎక్కువ సమయం కార్యకర్తలు, నాయకులు కలిసి ఉండడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.