Suryakumar Yadav : భారత్‌ను విశ్వవిజేతగా నిలిసిన సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాడు. టీమిండియాకు మూడో టీ20 ప్రపంచకప్ కట్టబెట్టి.. ఎంఎస్ ధోనీ(MS Dhoni), రోహిత్ శర్మ (Rohit Sharma) వంటి దిగ్గజ సారథుల సరసన నిలిచిన సూర్యను మాజీలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దాదాపు పదమూడేళ్ల కిందటి తన ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తుండడంపై సూర్యకుమార్ స్పదించాడు.
టీ20 సంచనలంగా భారత జట్టులోకి దూసుకొచ్చిన సూర్యకుమార్ యాదవ్ తన కలను సాకారం చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం రోహిత్ శర్మ వారసుడిగా పగ్గాలు చేపట్టిన సూర్య.. టీమిండియాను తిరుగులేని శక్తిగా నిలిపాడు. వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుపొందిన భారత జట్టుకు పొట్టి ప్రపంచకప్ ట్రోఫీని అందించాడీ మిస్టర్ 360. మూడో టీ20 కప్‌తో యావత్ భారతావనిని సంబురాల్లో మునిగితేలుతున్న వేళ.. సూర్య భాయ్ పాత ఫొటోలు ఆన్లైన్లో వైరలవుతున్నాయి.
🚨 FROM PETROL PUMP TO WORLD CHAMPION CAPTAIN: SURYA 🚨
Suryakumar Yadav said🎙️– “So happy for this guy today. From a 12-year-old picture at a petrol pump inauguration to lifting the World Cup trophy as Captain at Ahmedabad, it has been an emotional journey!” 🤯🔥 pic.twitter.com/wd7ZjWV7d7
— Sam (@Cricsam01) March 9, 2026
వాటిలో ఒకటి పెట్రోల్ పంపు ప్రారంభోత్సవం సందర్భంగా తీసిన ఫొటోకాగా.. రెండోది అహ్మదాబాద్ పిలుస్తోంది అనే ట్యాగ్‌తో ఉన్న ఫొటో. ఈ రెండు ఫొటోలపై సూర్య స్పందిస్తూ.. ‘కొందరు నా పాత ఫొటోలు రెండు ట్రెండ్ అవుతున్నాయని చెప్పారు. నా సోషల్ మీడియా బృందం సైతం ఈ ఫొటోలను చూసి.. నాకు వాట్సాప్ చేసింది. పెట్రోల్ పంపు దగ్గరి ఫొటో చూడగానే 2010 రోజులు గుర్తుకొచ్చాయి.
𝐓𝐡𝐞 𝐓𝐞𝐫𝐫𝐢𝐟𝐢𝐜 𝐓𝐫𝐢𝐨 🏆🏆🏆
Surya Kumar Yadav joins MS Dhoni and Rohit Sharma in the elite list of #TeamIndia captains to lift the ICC Men’s T20 World Cup 🫡👏#T20WorldCup | #MenInBlue | @msdhoni | @ImRo45 | @surya_14kumar pic.twitter.com/ui4OTMfH6l
— BCCI (@BCCI) March 9, 2026
నా స్నేహితుడి పెట్రోల్ పంపు ప్రారంభోత్సవానికి వెళ్లాను. అప్పుడు దిగిన ఫొటోనే అది. ఇక రెండో ఫొటో విషయానికొస్తే.. అహ్మదాబాద్ పిలుస్తోంది అనే క్యాప్షన్‌తో పెట్టాను. ఆ ఫొటోలో చెప్పినట్టుగా ఇంత దూరం రావడానికి 15 ఏళ్లు పట్టింది. ఇన్నేళ్ల ప్రయానం నిజంగా అద్భుతం’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.