మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 20 : చిచ్చుపెట్టే బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో జాగ్రత్తగా ఉండాలని, కాంగ్రె స్ బీజేపీ దొందూ దొందే అని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మోటర్‌లైన్, 20వ వార్డు మర్లులో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వార్డులో ప్రజలు ఘన స్వాగ తం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి రెండున్నరేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేసిండు. పది సంవత్సరాలు చేసిన అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక పుస్తకాన్ని ప్రచురించాం. ధైర్యం ఉంటే సమైఖ్య రాష్ట్రంలో 11 పర్యాయాలు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ తాము చేసిన అభివృద్ధిపై పుస్తకం ప్రచురించమనండి.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కరెంటు లేక పరిశ్రమలు, వ్యాపారాలు ఖతమయ్యాయి. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత కరెంట్ కష్టాలకు చెల్లుచీటీ పాడడంతో వ్యాపారాలు తిరిగి ఊపందుకున్నాయి. కులం, మతం పేరిట బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలు చేస్తూ ఓట్లను కొల్లగొట్టెందుకు కుట్రలు చేస్తుందని మంత్రి విమర్శించారు. ఇలాంటి నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కుల, మతాలకు అతీతంగా గుళ్లు, గోపురాలు, మసీదులు, చర్చీలు నిర్మిస్తూ లౌకిక పాలన చేస్తున్నామన్నారు. అనంతరం ఇటీవల మరణించి మాజీ కౌన్సిలర్ పిల్లిసురేశ్ను కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, కౌన్సిలర్లు రామ్‌లక్ష్మణ్, అనంతరెడ్డి, నీరాజ, నా యకులు అహ్మద్అలీసనా, హన్నాన్, అర్షద్అలీ, రవీందర్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, రాములు, మహ్మద్‌గౌస్, బాబుల్‌రెడ్డి, ఖాదీర్, సమాద్ఖాన్, సుల్తాన్ పాల్గొన్నారు.
హన్వాడ, నవంబర్ 20 : రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని, వ్యవసాయానికి 24గంటల కరెంట్, పంట పెట్టుబడి, రైతుబీమా వంటి పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పే ర్కొన్నారు. మండలంలోని బుద్ధారం, కారంతండా, దో ర్రితండా గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. బుద్ధారంలో శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతుగా యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వస్తే దళితుల భూములను తీసుకుంటారని ప్రచారం చేస్తున్న ఇతర పార్టీల నాయకులకు చెప్పాడి దళితుల భూమి సెంటు పోయిన నేనే బాధ్యత. మాయ మాటలు నమ్మిమోసపోవద్దని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల టికెట్లను రేవంత్‌రెడ్డి అమ్ముకున్నారని, నాకు ఇస్తానని చేప్పి ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆరోపించారు.కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, ఎంపీపీ బాలారాజు, జెడ్పీటీసీ విజయనిర్మాల, సర్పంచులు చెన్నయ్య, కాళిబాయి, సుగుణ, ఎంపీటీసీ మాల్కాయ్య, కరుణాకర్‌గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్, నాయకులు కొండ లక్ష్మయ్య, జంబులయ్య, వడ్లశేఖర్, నరేందర్, బాలయ్య, బసిరెడ్డి, రామణారెడ్డి, మన్నాన్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 20 : ఈ నెల 22వ తేదీన మహబూబ్‌నగర్‌లో నిర్వహించే ప్రజాఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రానున్నారని, ఆయన ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మం త్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బాయ్స్ కళాశాల మైదానం లో నిర్వహించనున్న సభా ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఉన్నారు.