వంగూరు, జూన్ 12 : మండలంలోని కొండారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఉదయ్‌కుమార్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి ము ఖ్య అతిథులుగా హాజరై వి ద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ ఉదయ్‌కుమార్ మా ట్లాడు తూ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ ల క్ష్యమన్నారు. అనంతరం ఎంపీ మల్లురవి మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చే సేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం భవన నిర్మాణ కార్మికుల అధారిత కుటుంబాల మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి న్యాక్ సంస్థ ద్వా రా కుట్టు మిషన్, సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమమ్మ, జెడ్పీటీసీ కేవీఎన్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ సురేందర్‌రె డ్డి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, డీఈవో గోవిందరాజులు, ఆర్డీవో శ్రీనివాసు లు, తాసీల్దార్ కిరణ్మయి, ఎంఈవో శంకర్‌నాయక్, నాయకులు పండిత్రావు, రాజశేఖర్రె డ్డి, కృష్ణారెడ్డి, నరేందర్‌రెడ్డి, వేమారెడ్డి, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
తాడూరులో..
తాడూరు, జూన్ 12 : మండల కేంద్రంలోని కస్తూర్భా పాఠశాలను ఎంపీ మల్లురవి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం కస్తూర్భా పాఠశాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నో రకాల సదుపాయాలు కల్పిస్తుందని, వీటన్నింటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయని, వి ద్యార్థులు పాఠశాలకు సకాలంలో వచ్చేలా విద్యార్థులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎంపీ వెంట జెడ్పీటీసీ రోహిణి, ఎంపీటీసీ రేణుకమ్మ, నాయకులు వల్లభ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మల్లయ్య ఉన్నారు.
అమ్రాబాద్‌లో..
అమ్రాబాద్, జూన్ 12 : మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో మండల వి ద్యాధికారి బాలకిషన్ విద్యార్థులకు యూని ఫాం, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఐఈఆర్టీ రాఘవేందర్, హెచ్ఎంలు పాల్గొన్నారు.
కోడేరులో..
కోడేరు, జూన్ 12 : మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్య, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. కోడేరు, ఎత్తం మైలారం, నాగులపల్లి, జనుంపల్లి, తీగలపల్లి, బావాయిపల్లి గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు బుధవారం పాఠ్యపుస్తకాలను అందజేశారు.
చారకొండలో..
చారకొండ, జూన్ 12: ప్రభు త్వ బడుల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంద ని ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్ అన్నారు. బుధవారం మండ ల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపి ణీ చేశారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం యాదగిరి, పంచాయతీ కార్యదర్శి గణేశ్, ఉపాధ్యాయురాలు మాధవి ఉన్నారు.
తిమ్మాజీపేట, కల్వకుర్తి మండలాల్లో..
తిమ్మాజిపేట/కల్వకుర్తి రూరల్, జూన్ 12 : తిమ్మాజిపేట, కల్వకుర్తి మండలాల్లోని ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బుధవారం తె రు చుకున్నాయి. ఈ సందర్భంగా ప్ర భుత్వ పాఠశాలలను, తరగతి గదుల ను ఉపాధ్యాయులు అందంగా అలంకరించి విద్యార్థులకు స్వాగతం పలికా రు. తిమ్మాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య, నోట్ పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంఈవో శ్రీనివాసులు, జీహెచ్ఎం సత్యనారాయణశెట్టి, ఏపీఎం శ్రీహరి, ఉపాధ్యాయులు ఉన్నారు.