నాగర్‌కర్నూల్, మే 30 : సరైన వైద్యం అందక నవజాత శిశువు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూ ల్ జిల్లా దవాఖానలో ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. బాధితుల కథనం మేరకు.. తాడూరు మం డలం అల్లాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వరి(28) కాన్పు కోసం బుధవారం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. ఈక్రమంలో నొ ప్పులు ఎక్కువవడంతో గర్భిణి బాత్రూంలోనే ప్ర సవించగా శిశువు మృతి చెందింది.
కాగా సరైన వై ద్యం అందించకపోవడంతోనే శిశువు మృతిచెందిన ట్లు బాలింత భర్త ఆంజనేయులు ఆరోపించాడు. మూడో కాన్పుకోసం దవాఖానకు వస్తే పట్టించుకోకపోవడంతో బాత్రూమ్లోనే ప్రసవించిందని, వై ద్యుల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ మృతి చెందిందని బాధితుడు వాపోయాడు. సూపరింటెండెంట్ రఘు ను వివరణ కోరగా వైద్యుల నిర్లక్ష్యమేమీ లేదని, స రైన సమయంలోనే వైద్యం అందించారని తెలిపా రు. 8నెలల 15 రోజులకే డెలివరీ, శిశువు బరువు తక్కువ ఉండడమే మరణానికి కారణమన్నారు.