నాగర్‌కర్నూల్, జనవరి 4 : రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించడంతో రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న 50లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డార ని, వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరమున్నదని పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వరర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామయ్య డి మాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ చౌరస్తాలో ఆటో కార్మికులు గురువా రం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ య్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రవాణారంగంపై 50లక్షల మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారని, వారి సంక్షేమం గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ప్రమాద బీమా రూ.10లక్షలు ఇవ్వాలన్నారు.
ఆటోలు, ఇతర రవాణారంగ వాహనాలను ఫైనాన్స్‌లో తీసుకొచ్చి వాటిని నడుపుతూ జీవనం సాగించేవారన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం చేయడంతో ఫైనాన్స్ కట్టలేక వాహనాలను అప్పు ఇచ్చినవారు తీసుకెళ్తుండగా, కుటుంబాలు పూట గడవక రోడ్డుపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 మోటరు వాహన చట్టాన్ని రద్దు చే యాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ల తో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్, ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వరర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి, ఉపాధ్యక్షుడు శివ, సైదులు, ఖాజా, దేవేందర్, సుధాకర్, రాజు, శ్రీను పాల్గొన్నారు.