మాగనూరు : మే నెలలోనే సమృద్ధిగా వర్షాలు కురిసి కృష్ణా నది ( Krishna River ) పరవళ్ళు తొక్కుతుంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల జూరాల ( Jurala ) నుంచి దిగువకు నీటిని వృధాగా విడుదల చేస్తున్నారని బీఆర్ఎస్( BRS) మాగనూర్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి ( Yella Reddy ) ఆరోపించారు.
ఆయన మాట్లాడుతూ కృష్ణానది పూర్తిస్థాయిలో ప్రవహిస్తున్నప్పుడు మక్తల్ నియోజకవర్గంలో ఉన్న నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి నీటిని తరలించడంలో ప్రజా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రస్తుతం రైతులు నారుమళ్లు వేసుకునే సమయం కావడంతో రిజర్వాయర్లు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు.
రైతుల పట్ల ప్రజా ప్రభుత్వానికి ఏమాత్రం ప్రేమ ఉన్న తక్షణమే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు నది నుంచి సాగునీరు తరలించి, రైతులకు కాలువల ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.