కులవృత్తులకు ప్రభుత్వం పెద్దపీట
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కన్నీళ్లే తప్పా ఒరిగిందేమీ లేదని, సీఎం కేసీఆర్ హయాంలో కులవృత్తులకు పెద్దపీట వేసి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
- అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
- మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
- మాదాసి, మాదారి కరుమ కులస్తులతో ఆత్మీయ సమ్మేళనం
మక్తల్ టౌన్, నవంబర్ 11 : కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కన్నీళ్లే తప్పా ఒరిగిందేమీ లేదని, సీఎం కేసీఆర్ హయాంలో కులవృత్తులకు పెద్దపీట వేసి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే తన స్వగృహంలో నియోజకవర్గంలోని కృష్ణ, ఊట్కూరు మండలాల మాదాసి, మాదారి కురుమ కులస్తుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తాగు, సాగునీరు లేక ఎంతో మంది పొట్టచేతబట్టుకొని వలసలు వెళ్లారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సాగునీటితో రైతులు సంబురంగా సాగు చేసుకుంటూ నేడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగారన్నారు. గ్రామాల్లో లక్ష్మీపుత్రులుగా పిలుచుకునే కురుమ కులస్తులు నిజాయితీపరులని పేర్కొన్నారు. మరోసారి బీఆర్ఎస్ను గెలిపించి మరింత అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ గోవిందప్ప, కురుమ సంఘం నాయకుడు నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు ఆశిరెడ్డి, శివరాజ్ పాటిల్, కురమ సంఘం నాయకులు శరణప్ప, ఎల్లలింగ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిక
మున్సిపాలిటీలోని 7వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కార్యకర్తలు శనివారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, రాజుల ఆశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

