ఓటుతోనే బుద్ధిచెప్పాలి
తొమ్మిదేండ్లలోనే 70ఏండ్ల ప్రగతిని సాధించామని.. ఓర్వలేని వారు ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఓటుతో సమాధానం చెప్పాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.
- గెలుపుతో కాంగ్రెస్, బీజేపీలకు దిమ్మతిరగాలి
- గ్రామాల్లోకి వచ్చిన ప్రతిపక్ష నేతలను తిప్పికొట్టాలి
- ఆధునిక టెక్నాలజీతో గణపసముద్రానికి మరమ్మతులు
- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- ఖిల్లాఘణపురంలో బీఆర్ఎస్ ముఖ్యనాయకుల ఆత్మీయ సమ్మేళనం
వనపర్తి/ఖిల్లాఘణపురం, జూలై 18 : తొమ్మిదేండ్లలోనే 70ఏండ్ల ప్రగతిని సాధించామని.. ఓర్వలేని వారు ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఓటుతో సమాధానం చెప్పాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఖిల్లాఘనపురం మండల కేంద్రంలోని బాదం సరోజినీదేవి కల్యాణ మండపంలో మంగళవా రం మండలంలోని 27గ్రామ పంచాయతీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎస్ఎన్ఆర్ యువసేన నాయకులతో మంత్రి నిరంజన్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తొమ్మిదేండ్లలో చే పట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వి వరించారు. ఆయా గ్రా మాల్లో నెలకొన్న సమస్యలపై మంత్రి వినతులను స్వీకరించి పరిష్కారానికి తీసుకునే చర్యలను అక్కడే వివరించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతిపక్షాలు తలకిందులుగా తపస్సు చేసినా అధికారంలోకి రారని, ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశా రు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి తొమ్మిదేండ్లలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గు రించి వివరించి ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రూ.3.30కోట్లతో బీటీ రోడ్డు..
ముసాపేట మండలం నిజాలాపూర్ నుంచి మహ్మద్ హుస్సేన్‌పల్లి వరకు రూ3.30కోట్లతో బీటీ రోడ్డును నిర్మించేందుకు నిధులను మంజూరు చేసినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. తమ గ్రామాన్ని మూసాపేట మండలంలో కా కుండా పాత ఖిల్లాఘణపురంలో కొనసాగించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించారు. అనంతరం సర్పంచ్ నిర్మల జన్మదినం సందర్భంగా కేక్‌కట్ చేశారు.
ఆధునిక టెక్నాలజీతో గణపసముద్రం రిజర్వాయర్..
గణప సముద్రం రిజర్వాయర్‌ను ఆధునిక టెక్నాలజీతో రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇండ్లలోకి నీరు చేరుతుందని, పంటలకు జమ్ము పడుతుందని, కట్టకు పగుళ్లు పడి నీరు కిందకు వస్తాయనే అపోహలకు గురికావొద్దన్నా రు. సముద్రాలు, నదుల్లో వంతెనలను ఏర్పాటు చేసిన టెక్నాలజీతోనే గణపసముద్రం మరమ్మతు చేస్తామని రైతులు, గ్రామస్తులు అధైర్యపడొద్దన్నారు. గణప సముద్రంలో పాత మునక కంటే కే వలం 14ఎకరాలు మాత్రమే భూమి ముంపునకు గురవుతున్నదన్నారు. పా త, కొత్తవారికి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్‌తోపాటు అన్ని విధాలా ఆదుకునే బాధ్యత తనదేనన్నారు.
గృహలక్ష్మి అందిస్తా..
మండల కేంద్రంలోని తెలుగు వీధి, హరిజనవాడ, అనేక కాలనీల్లో పాడుబడిన ఇండ్లు ఉన్నాయని, విడుతల వా రీగా గృహలక్ష్మి పథకం ద్వారా ఆదుకుంటామన్నారు. మొదటి విడుతగా 200 ఇండ్లను మండల కేంద్రానికి కేటాయిస్తున్నామన్నారు. అదేవిధంగా బస్టాండ్ వె నుక గల మార్కెట్లో రూ.2కోట్లతో ఆ ధునిక హంగులతో కూరగాయల మార్కెట్‌ను నిర్మించేందుకు టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి ఈ మేరకు వెల్లడించారు.
బీసీ ప్లాట్లతో పేదలకు మేలు..
గత ప్రభుత్వాలు బీసీ ప్లాట్లను ఏర్పాటు చేసి లబ్ధిదారులను గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాయని, దీంతో నాటి నుంచి ప్లాట్లను నమ్ముకుని 675 మంది లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారని మంత్రి తెలిపారు. వారందరికీ భరోసానిస్తూ బీసీ ప్లాట్లలో ప్రతి లబ్ధిదారుడికి ప్లాట్లు ఇవ్వడానికి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నేతృత్వంలో అధికారులు కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే పట్టాలను పంపిణీ చేస్తామని స్ప ష్టం చేశారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ వెనుక భాగంలోని ఖాళీ స్థ లంలో ఇండోర్ స్టేడియం, క్రీడా మై దానం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరెంటు కష్టాల నుంచి సీఎం కేసీఆర్ ఎంతో శ్రమించి వె లుగులు తీసుకురాగా, సోయిలేని కాంగ్రెసోళ్లు ఉన్న కరెంటును తొలగించి మళ్లీ చీకట్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అభివృద్ధి వ్యతిరేకులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ పీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యనాయక్, సింగిల్ విండో అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, వైస్ చైర్మన్ రాజు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు వెంకట్రావు, జిల్లా శిక్షణ తరగతుల అధ్యక్షు డు పురుషో త్తం రెడ్డి, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, స ర్పంచ్ వెంకటరమణ, ఎంపీటీసీ ఆశాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

