అలంపూర్/ఉండవల్లి, ఏప్రిల్ 25 : అధికారం కోసం తపిస్తున్న ప్రతిపక్ష నాయకుల కుట్రలు, కు తంత్రాలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ జోగుళాం బ గద్వాల జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. అలంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే అబ్రహం అధ్యక్షతన మంగళవారం నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేయాలన్నారు. ఉమ్మడి పాలకుల చేతిలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు. నేడు స్వరాష్ర్టంలో సగర్వంగా తలెత్తుకొని బతుకుతున్నామన్నారు. నేడు కోట్లాది మంది ప్రజలు బీఆర్ఎస్ సైనికులుగా ప నిచేస్తున్నారన్నారు. ఎంతోమంది అమరవీరుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణలో ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని వ మ్ము చేయకుండా పాలన కొనసాగిస్తున్నారన్నా రు.
దేశం గర్వించదగ్గ పథకాలు అమలుచేస్తున్న ట్లు వివరించారు. మన సంక్షేమం దేశవ్యాప్తంగా అమలుచేయాలన్న దృఢసంకల్పంతో బీఆర్ఎస్ పార్టీగా విస్తరించామన్నారు. దీంతో బీజేపీ, కాం గ్రెస్ నాయకులకు వణుకుపుడుతుందన్నారు. ని యోజకవర్గంలో కొంతకాలంగా నెలకొని ఉన్న గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. నాయకులకు ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. అలంపూర్పై సీఎం కేసీఆర్కు ఎంతో ప్రేమ ఉందని, అందుకే మల్లమ్మకుంట రిజర్వాయర్ అనుమతులు, ఎర్రవల్లి మండలకేంద్రం ఏర్పాటు ఒక్క రోజులోనే సాధించామన్నారు. ఎమ్మెల్యే అబ్ర హం మాట్లాడుతూ ఆధికారం కోసం రాజకీయా లు చేస్తున్న ఆగంగాళ్ల మాటలు నమ్మొదని సూ చించారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని గు ర్తుంచుకొని.. మరోమారు అధికారంలోకి వచ్చే లా ప్రతి ఒక్కరూ కృషి చేయలని పిలుపునిచ్చా రు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నాలుగేండ్లలో నే రూ.1600 కోట్లు ఖర్చు చేశామన్నారు. భవిష్యత్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదిక అందిస్తామన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారన్నారు. సమ్మేళనాలను విజయవంతం చేసినందుకు ప్రజాప్రతినిధు లు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంత రం బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు 12 అంశాలతో కూడిన తీర్మానాలు చేశారు. అంతకుముం దు బీఆర్ఎస్ జెండావిష్కరణ చేశారు. తెలంగాణ తల్లి, అమరవీరులకు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ మండలాధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.