అలంపూర్ /రాజోళి, జూన్ 7 : తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన రాజోళి మండలకేంద్రం సరిహద్దులో ఉన్న తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలపై ఏపీ, తెలంగాణ అధికారులు ఎన్నిసార్లు పరిశీలించిన సరిహద్దు వివాదం రగులుతూనే ఉం ది. శనివారం అర్ధరాత్రి ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసుల కు సమాచారం ఇవ్వకుండా రాజోళిగ్రామంలో పర్యటిస్తూ ఎడ్లబండ్లతో డంప్‌లు చేసుకున్న ఇసుకను తరలిస్తున్నారంటూ దా డులు చేపట్టారు. ఖాళీగా ఉన్న ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుంటామని బెదిరిస్త్తూ హల్చల్ చేశారు. ఆగ్రహించిన స్థానికు లు పదుల సంఖ్యలో అక్కడికి చేరుకొని మా సరిహద్దులోకి వచ్చి గ్రామ నడిబొడ్డున మమ్మల్నే బెదిస్తారా అంటూ ప్రజలు ఆగ్రహంతో ఏపీ పోలీసులపై తిరగబడ్డారు.
ఏపీ పోలీసులు మా సరిహద్దు లో ఇసుకను తరలిస్తున్నారని అనడంతో మరింత ఉగిపోయిన జనం కేకలు వేయడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న రాజోళి ఎస్సై తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఏపీ పోలీసులు తమ అనుమతులు లేకుండా వచ్చి రగడ చేస్తున్నారని స మాచారం లేకుండా ఇక్కడకి వచ్చి హల్చల్ చేయడం సరైన పద్ధతి కాదని ఏపీ పోలీస్ అధికారులతో మాట్లాడారు. ఈ సమస్యపై తెలంగాణ జిల్లా ఉన్నత అధికారులు కలుగజేసుకోవడంతో ఏపీ పోలీస్ అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. తరుచూ ఇలా ఏపీకి చెందిన కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడుతూ ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చిన ఇసుక రీచ్‌ల ద్వారా కూడా ఇసుకను తరలించే అవకాశం లేదని ఏపీకి చెందిన నాయకుడు వారం కిం దట తూర్పు గా ర్లపాడు రీచ్ వద్దకు 100మంది కార్యకర్తలతో వచ్చి అధికారులను హెచ్చరించిన ఘటన విధితమే.
తెలంగాణ సరిహద్దు లో ఇసుక లేదని, మీరు ఇసుక తరలిస్తే దాడులు తప్పవని హెచ్చరించారు. ఆ నాయకుడు అలా మాట్లాడుతున్నా అక్కడే ఉన్న గద్వాల జిల్లా మైనింగ్ అధికారి, సీఐలు కూడా ఏమి అనలేక చూస్త్తూ ఉండిపోయారు. ఏపీకి చెందిన నాయకుడు ప్రభుత్వం అనుమతులు ఉన్నా ఇసుకను తరలించరాదని అన్నప్పుడు మన అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. మైనింగ్ శాఖ అధికారులు తుంగభద్ర నదిలో హద్దులను గుర్తించి తెలంగాణ ప్రజలకు సహకరిస్తే బాగుటుందని అంటున్నారు.