మాగనూరు, నవంబర్ 2 : అకాల వర్షాలు, తుఫాన్లతో నిండా మునిగిన రైతులను అరకొరగా మిగిలిన పత్తినైనా అమ్ముకుందామంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. మాగనూరు మండలంలోని వడ్వాట్ బసవేశ్వర కాట న్ మిల్లులో ఇటీవలే మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఏఎంసీ భారతీయ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలును ప్రారంభించారు. ప్రారంభించి వారం రోజులవుతున్నా కొనుగోళ్లు మాత్రం చేయడం లేదని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పత్తి కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో దళారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంకొంతమంది మంది రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారు.
ప్రభుత్వం కొత్త కొత్త నియమాలు తీసుకొచ్చి రైతు లను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కంపాస్ కిషన్ యాప్లో ఒకరోజు 100 స్లాట్ బికింగ్లు మాత్రమే అవుతున్నాయని, మక్త ల్ మండలం నారాయణపేట రోడ్డులో ఏర్పాటు చేసిన వినాయక కాటన్ మిల్లులో మాత్ర మే అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చూ పిస్తున్నట్లు వాపోయారు. అధికారులు కొత్త రూల్స్ తీసుకొచ్చి ఎల్-1, ఎల్-2, ఎల్-3 అనే ఆప్షన్స్ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు.
పత్తి కొనుగోలు ప్రారంభించకపోతే జాతీయ రహదారిపై పెద్దఎత్తున ధర్నా చేపడుతామని మాగనూరు, కృష్ణ మండలాల రైతులు స్పష్టం చేశారు. ఈ విషయంపై ఏఎంసీ మారెట్ కార్యదర్శి భారతిని వివరణ కోర గా.. ఈ ఏడాది కొత్తగా ఎల్-1, ఎల్-2, ఎల్-3 నిబంధనలు ప్రవేశపెట్టడంతో ఎల్-1 కెపాసిటీ పూర్తయ్యాక ఎల్-2 పత్తి కొనుగోలు ప్రారంభిస్తారని చెప్పారు. మాగనూరు మండలం ఎల్-3లో ఉం డడంతో గు డిగండ్ల తర్వాత మాగనూరు బసవేశ్వర కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు ప్రారంభిస్తారని తెలిపారు.