అలంపూర్ చౌరస్తా, జూన్ 28 : జోగుళాంబ గద్వాల జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల ను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కలిసి విన్నవించారు. శనివారం జూరాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరిని కలిసి పు ష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్డీఎస్ ఆ యకట్టుకు సాగునీరు అందించేందుకు బీఆర్ఎ స్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన తు మ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో ప్ర ధానంగా రైతులకు ఆయువుగా భావించే మల్లమ్మకుంట, వల్లూ రు, జూలకల్లు రిజర్వాయర్లను పూర్తి చేసి ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కోరారు.
అదేవిధం గా చిన్నోనిపల్లి నుంచి ఆర్డీఎస్కు లింకు కలిపి ఆయకట్టుకు మరింత జీవం పోయాలని, అలాగే నెట్టేంపాడును పూర్తి చేయాలని మంత్రికి వివరించారు. ప్రసుత్తమున్న తు మ్మిళ్ల మోటర్లు ద్వారా ఆయకట్టుకు నీరు అం దుతున్నప్పటికీ అది తాత్కాలిక ప్రయాజనంగా మారుతుందని రిజర్వాయర్లును నిర్మించి ఆయకట్టుకు శాశ్వత ప్రయోజనం కల్పించాలని మం త్రికి వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట అలంపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ప్ర జాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.