అలంపూర్ చౌరస్తా, నవంబర్ 13: ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు అందేలా చూస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అలంపూర్, వడ్డేపల్లి, ఉండవల్లి, రాజోళి మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.98,11,368 చెక్కులను అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.