విలేజ్ బ్యాక్‌డ్రాప్ ప్రేమకథగా రూపొందుతున్న చిత్రం ‘R’. సంతోష్ కృష్ణన్, భాగ్యరెడ్డి ప్రధాన పాత్రధారులు. గోలి రామకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తామని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరణ జరుపుతామని, అక్టోబర్ 17న సినిమాను విడుదల చేస్తామని దర్శక, నిర్మాత గోలి రామకృష్ణ తెలిపారు. బ్రహ్మానందరెడ్డి, దుర్గమనాయుడు, పవన్, సిరి, సంధ్య, భానుచందర్, స్వాతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి కెమెరా: అశోకరెడ్డి కంకల్ల, సహనిర్మాత: గాలి బాలకిరణ్రెడ్డి, సమర్పణ: శిరీష, నిర్మాణం: GMAA ఎంటర్టైన్మెంట్స్.