గద్వాల అర్బన్/రాజోళి, జూన్ 4 : పచ్చని పొలాల మధ్య చిచ్చు పెట్టే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దు అని అడిగితే బౌన్సర్లతో దాడులు చేయిస్తారా.. అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం రాజోళి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఫ్యాక్టరీ వద్ద ప్రజలకు, అధికారులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలు అవ్వడంతో స్థానికులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు దవాఖానకు చేరుకొని చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయరాదని పెద్ద ధన్వాడ గ్రామంతోపాటు ఆ చుట్టు ప్రక్కల గ్రామాలు నిరసనలు, నిరాహార దీక్షలు చేస్తున్న క్రమంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితోపాటు, తాను మద్దతు తెలిపినట్లు గుర్తు చేశారు. ఈ సమస్యపై ఎమ్మెల్సీ చల్లా శాసన మండలిలో నూ ప్రస్తవించారని, ఎట్టి పరిస్థితిలలో అ క్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని, సంబధిత శాఖ అధికారులు, మంత్రులకు వినతులు అందజేశామన్నారు. నిరాహార దీక్ష లో ఉన్న గ్రామాల ప్రజలకు న్యాయం చే స్తామని చెప్పి అధికార పార్టీ నాయకులు, అధికారులు ప్రజలకు నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపచేసే విధంగా వ్యవహరించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
ఫ్యాక్టరీ రాదు మీకు న్యాయం చేస్తామని చెప్పిన అధికార పార్టీ నాయకులు ప్రస్తుతం గ్రామంలో ఇంత ఉద్రిక్తత ఘటనలు చోటు చేసుకుంటుంటే ఎందుకు స్ప ందించడం లేదని ప్రశ్నించారు. నిజ ంగా ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకించినట్లయితే నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఎం దుకు మద్దతు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఫ్యాక్టరీ ఏర్పాటును ముక్తకంఠంతో నిరసించాల్సింది పోయి.. మీ నా యకుడు ఏం చేస్తున్నాడు.. మా నాయకు డు ఇలా అని అనవసర రాద్ధాంతాలను సృ ష్టిస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారన్నా రు. ఫ్యా క్టరీపై మా నిర్ణయాన్ని.. చట్టసభ ల్లో వెలిబుచ్చిన మా గొంతుకను, నీ ముం దు ఉంచుతున్నామన్నారు. ప్రజల జోలి కొస్తే ఉరుకునేది లేదని హెచ్చరించారు.