భూత్పూర్, జనవరి 26 : త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం భూత్పూర్ ము న్సిపాలిటీ పాలక మండలి పదవీ విరమణ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అమలు కు చేతగాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను నిలువునా మోసం చేసిందన్నారు.
పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేస్తామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. చాలా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లను తొలిగించి కాంగ్రెస్ పార్టీ వారిని ఏర్పాటు చే యగా, భూత్పూర్, కొత్తకోట మున్సిపాలిటీ ల్లో మా త్రం సాధ్యం కాలేదన్నారు.
అనంతరం మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్‌రె డ్డి, కౌన్సిలర్లు బాలకోటి, రామకృష్ణ, కృష్ణవేణి, గడ్డం నాగ మ్మ, వసంత, కో ఆప్షన్ సభ్యులు మల్లమ్మ, జాకీర్, అజీ జ్, అమ్రీన్‌ను సన్మానించి జ్ఞాపికలతో అభినందించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు చంద్రశేఖర్‌గౌడ్, చంద్రమౌళి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, నర్సింహా గౌడ్, సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, రామేశ్వర్రావు, సా యిలు, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.