భూత్పూర్, జూలై 8 : బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సైనికులుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని యువ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు గ్రామాల్లో ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఎన్నిక ల సమయంలో రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలను అ మలు చేస్తానని మోసపూరిత మాటలను చెప్పి ఓట్లు వేయించుకున్నాడనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని సూచించారు. ఎన్నికల ముందు ఒకమాట, ఎన్నికలు అయిపోయాక ఓ మాట చెప్ప డం కాంగ్రెస్ పార్టీకే సొంతమని ఎద్దేవా చేశారు.
అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలను బీఆర్ఎస్ నా యకులు ప్రజలకు వివరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిత్యం కేసీఆర్ అప్పులు చేసిండని అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. దీన్ని యువకులు సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టాలని సూ చించారు. పార్లమెంట్లో కాగ్ నివేదిక ఇచ్చిన అప్పు ల వివరాలు రూ.2లక్షల 80వేల కోట్లు అని వివరించారు. బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడానికి రూ.7 లక్షల కోట్లు అని అసత్య ప్రచారాలను చేస్తున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని పాదయాత్ర చేపడితే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చారని, దీని మూలంగా ఒరిగిందేమీ లేదని ఆ యన విమర్శించారు. ఎమ్మెల్యే అడ్డాకులకు బ్రహ్మో స్ తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారు. బ్రహ్మోస్‌కు పొలం ఎవరి హయాంలో కేటాయించారో తెలుసుకోవాలని అన్నారు.
అప్పుడు ఎయిర్‌పోర్టు కోసం తాను స్థలం కేటాయిస్తే ఇప్పుడు బ్రహ్మోస్‌ను ఆ స్థలంలో ఏర్పాటు చేసయాలని ప్రణాళికలను తయా రు చేస్తున్నట్లు ఆయన విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్(ఎస్ఐఆర్) కార్యక్రమంపై బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించా రు. బీఎల్వోలు ఇచ్చిన రెండు ఎన్యూమరేషన్ పత్రాలను నింపి ఒకటి బీఎల్వోకు ఇవ్వాలి, మరొకటి ఓటరు తమ వద్ద అక్టోబర్ నెల వరకు భద్రపరుచుకోవాలని ఆయన సూ చించారు. అక్టోబర్ నెలలో వచ్చే ఓటరు తుది జాబితాలో మీ పేరు ఉన్నైట్లెతే పక్కా మీ ఓటు ఉన్నట్లు. అనంతరం మాజీ ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యుల ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్వోతోపాటు ప్రత్యేకాధికారికి అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ ఆల శ్రీకాంత్‌రెడ్డి, మహిళా నేత ఆల ప్రీతిరెడ్డి, మాజీ సర్పంచ్ సత్తూర్ నారాయణగౌడ్, మురళీధర్‌గౌడ్ పాల్గొన్నారు.