IND vs ZIM | రెండో అర్ధశతకంతో రెచ్చిపోయిన వైభవ్.. జింబాబ్వే పరువు దక్కేనా..!
IND vs ZIM : భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(81) మళ్లీ చెలరేగాడు. తన మార్క్ విధ్వంసతో జింబాబ్వే బౌలర్లను ఉతికేస్తూ అంతర్జాతీయ టీ20ల్లో రెండో అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు.
IND vs ZIM : భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(81) మళ్లీ చెలరేగాడు. తన మార్క్ విధ్వంసంతో జింబాబ్వే బౌలర్లను ఉతికేస్తూ అంతర్జాతీయ టీ20ల్లో రెండో అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు. ఇషాన్ కిషన్(29), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(27)లతో హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు వైభవ్. ఆఖర్లో రింకూ సింగ్(25) బ్యాట్ ఝులిపించినా టీమిండియా 192 పరుగులే చేసింది. వరసగా రెండింటా ఓడి సిరీస్ సమర్పించుకున్న ఆతిథ్య జట్టు పరువు కోసం పోరాడుతుందా? లేదా అయ్యర్ సేన క్లీన్‌స్వీప్ చేస్తుందా? అనేది మరికాసేపట్లో తెలియనుంది.
టాస్ గెలిచిన బ్యాటింగ్ తీసుకున్న భారత జట్టుకు శుభారంభ దక్కలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ(2) మరోసారి ముజరబని ఓవర్లో వెనుదిరగగా.. వైభవ్ సూర్యవంశీ(81), ఇషాన్ కిషన్(29) కీలక భాగస్వామ్యం నిర్మించారు. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 64 రన్స్ చేసింది. జింబాబ్వే బౌలర్లపై అటాకింగ్ గేమ్‌తో విరుచుకుపడిన ఆడిన ఈ ద్వయం హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలోనే వైభవ్ అంతర్జాతీయ టీ20ల్లో రెండో అర్ధ శతకం సాధించాడు.
8️⃣1️⃣ runs
4️⃣9️⃣ deliveries
8️⃣ fours
4️⃣ sixesVaibhav Sooryavanshi thrilled Harare with another special outing 🌟👏
Updates ▶️ https://t.co/oApMpI6eRc#TeamIndia | #ZIMvIND pic.twitter.com/mkCLNzWNQe
— BCCI (@BCCI) July 26, 2026
సికిందర్ రజా ఓవర్లో ఇషాన్ బౌల్డయ్యాక.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(27)తో కలిసి చెలరేగాడు వైభవ్. సిక్సర్లతో చెలరేగుతూ శతకానికి చేరువైన అతడిని మధ్వీరె పెవిలియన్ చేర్చగా జింబాబ్వే బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తిలక్ వర్మ(11 నాటౌట్) జతగా గేర్ మార్చాలనుకున్న అయ్యర్‌ను ఎవాన్స్ బోల్తా కొట్టించాడు. రింకూ సింగ్(25) రెడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో మెరవగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
A solid batting effort led by Vaibhav Sooryavanshi’s fabulous knock 🔝
Over to our bowlers to defend 1️⃣9️⃣2️⃣ runs 🎯
Scorecard ▶️ https://t.co/oApMpI6eRc#TeamIndia | #ZIMvIND pic.twitter.com/20TaeRyVxk
— BCCI (@BCCI) July 26, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

