Vemulawada | నమస్తే తెలంగాణ కథనానికి వేములవాడ ఆలయ ఈవో స్పందన.. నాయిబ్రాహ్మణులకు వార్నింగ్
Vemulawada | వేములవాడ రాజన్న ఆలయ కళ్యాణకట్టలో నాయి బ్రాహ్మణులు అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో రమాదేవి హెచ్చరించారు. భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ నగదు డిమాండ్ చేయరాదని సూచించారు.
Vemulawada | వేములవాడ, జూలై 26: వేములవాడ రాజన్న ఆలయ కళ్యాణకట్టలో నాయి బ్రాహ్మణులు అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో రమాదేవి హెచ్చరించారు. కళ్యాణ కట్టలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ సోషల్మీడియాలో ఓ భక్తురాలు చేసిన ఆరోపణలను తాజాగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన ఈవో రమాదేవి.. పీఆర్వో కార్యాలయంలో నాయి బ్రాహ్మణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ నగదు డిమాండ్ చేయరాదని సూచించారు.
ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈవో వార్నింగ్ ఇచ్చారు. భక్తులు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేయడం ద్వారా ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని అన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తే తక్షణమే విచారించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

