జడ్చర్ల, మే 13: బాదేపల్లి వ్యవసాయ మార్కె ట్ యార్డుకు వ్యవసాయ ఉత్పత్తులు పోటెత్తాయి. దీంతో మార్కెట్ యార్డు షెడ్లతోపాటు ఆవరణ పూర్తిగా వ్యవసాయ ఉత్తత్తులతో నిండిపోయింది. ధాన్యం, మొక్కజొన్న, వేరుశనగ ఆముదాలు, పొద్దుతిరుగుడు గింజలతో మార్కెట్ ఆవరణ కిక్కిరిసిపోయింది. బుధవా రం ఒక్కరోజే మార్కెట్ యార్డుకు 24,757బస్తాల వివిధ రకాల సరుకులు అమ్మకానికి వచ్చాయి. మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తుల రాక పెరగడంతో టెండర్లు ఆలస్యమవుతున్నా యి. దీంతో రాత్రి వరకు తూకాలు కావడంలేదు.
మరుసటిరోజు కూడా తూకాలు వేస్తున్నారు. అదేవిధంగా వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకులను మార్కెట్‌యార్డు నుంచి సకాలంలో ఎత్తకపోవడంతో కొత్తగా మార్కెట్‌కు ధాన్యాన్ని తీసుకొస్తే స్థలం లేకుండా పోతున్నది. దీంతో పాటు మార్కెట్లో హమాలీల కొరత కారణంగా వ్యాపారులు కొనుగోలు చేసిన బస్తాలను త్వరగా ఎత్తలేకపోతున్నారు. దీంతో మార్కెట్లో రైతులకు, వ్యాపారులకు ఇబ్బందులు కలుగుతాయనే క్రయవిక్రయాలను రోజు విడిచి రోజు చేస్తామని మా ర్కెట్ కార్యదర్శి అశ్వక్ అహ్మద్ పేర్కొన్నారు. అయితే రోజు విడిచి రోజు క్రయవిక్రయాలు
జరుగుతాయన్న విషయం తెలియక రైతులు తమ సరుకులను మార్కెట్‌కు తీసుకొస్తున్నా రు. దీంతో మూడు, నాలుగు రోజులు మార్కెట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అదేవిధంగా అకాల వర్షాలు కూడా రైతులను, వ్యాపారులను భయపెడుతున్నాయి. రోజంతా బాగానే ఉన్నా సాయంత్రం అయ్యేవరకు మబ్బులు కమ్ముకోవడంతో తమ ధాన్యం తడిసిపోతాయేమోనన్న భయం రైతుల్లో నెలకొన్నది. ఎటుచూసినా రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. మొక్కజొన్న కోనుగోలు కేంద్రంలో మక్కలను కొనుగోలు చేయకపోతుండటంతో చాలామంది రైతులు మక్కలను తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు.
నెలరోజులుగా నిరీక్షణ
లింగాల, మే 13 : మొక్కజొన్న రైతుల గోసపడుతున్నా పట్టించు కునే నాథుడే కరువయ్యారు. మార్క్‌ఫెడ్, పీఏసీసీఎస్ ఆధ్వ ర్యంలో ఈనెల 13వ తేదీన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు హడావుడిగా ప్రారంభించారు. రైతులు ఆరుగాలల కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారుల ఉచ్చులో పడకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు విక్ర యిస్తే కష్టాలు తీరుతాయని వస్తే, కొనుగోలు కేంద్రంలో రైతులకు అవస్థలు తప్పడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో మార్కెట్లో సరిపడు గన్నీ బ్యాగులు లేకపోవడంతో చేసేదేమి లేక బయట నుంచి ఒక్కో బ్యాగుకు రూ.28 నుంచి 30 చెల్లించి బ్లాక్‌లో కొను గోలు చేస్తున్నారు.
ధాన్యాన్ని తీసుకెళ్లడానికి సకాలంలో లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రంలో ధాన్యం పేరుకుపోయింది. ఈదురు గాలలతో కూడిన అకాల వర్షం భారీగా కురవడంతో ధాన్యం తడిసి ముైద్దెంది. దీంతో రైతులు లబోదిబో మంటు న్నారు. కనీస మద్దతు ధర రూ.2400 వస్తుందని ఆశపడి కొను గోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొస్తే అధికారులు, ప్రజాప్రతి నిధులు పట్టించుకోకపోవడం ధాన్యం తడిసి మొలకలు వస్తున్నా యని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి లారీలు పంపించాలని రైతులు కోరుతున్నారు.
ఇద్దరి సస్పెన్షన్, ఒకరికి మెమో జారీ
గద్వాల అర్బన్, మే 13 : జోగుళాంబ గద్వాల జిల్లా తెలుగోనుపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహణను పట్టించుకోని పలువురు ఐకేపీ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చర్యలు తీసుకుంటూ బుదవారం ఆదేశాలు జారీ చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగోనుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేయగా.. అక్కడ నిర్వహణ లోపాలను గమనించారు. వీవోఏ అలివేలు, సీసీ రంగన్నను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఎం దేవానందానికి మెమో జారీ చేశారు.
అకాల వర్షం.. రైతన్న ఆగం

జడ్చర్ల, మే 13 : జడ్చర్లలో బుధవారం సా యంత్రం అకాల వర్షం కురిసింది. దీంతో బా దేపల్లి వ్యవసాయ మార్కెట్‌తోపాటు గంగాపూ ర్ రోడ్డులోని పత్తిమార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న ధాన్యంతోపాటు మక్కలు తడిసిపోయాయి. వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం పెద్దఎత్తున దాదాపు 30వేల బస్తాల పంట ఉత్పత్తులు అమ్మకానికి రావడంతో టెండర్లు ఆలస్యమయ్యాయి. దీంతో తూకా లు వేయడం కూడా ఆలస్యంగా మొదలయ్యాయి. ఈ క్రమంలో సాయ ంత్రం అకాలవర్షం కురవడంతో ధాన్యం కుప్ప లు, మొక్కజొన్న కుప్పలు తడిసిపోయాయి. కొంత మంది రైతులు ముందుగానే ధాన్యం కుప్పలపై టార్ఫాలిన్ కవర్లు కప్పడంతో వాటిని తడవకుండా కాపాడుకోగలిగారు.
అదేవిధంగా తూకాలు చేసిన ధాన్యం, మొక్కజొన్న బస్తాలు తడిసిపోయాయి. బస్తాలకు పెద్దగా నష్టంలేదు కానీ కుప్పలు కొద్దిమేర తడిసిపోయాయి. అదేవిధంగా పత్తి మార్కెట్‌యార్డులో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. ఇప్పటికే రైతులు తీసుకొచ్చిన మక్కలను కొనుగోలు చేయకపోవడంతో అవి మార్కెట్ యార్డులోనే ఉండిపోయాయి. దానికి తోడు చాలామంది రైతులు మక్కలును మార్కెట్‌కు తీసుకొచ్చి అక్కడే ఉంచారు. ఈ అకాలవర్షాలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తడిసిన మొక్కలను, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.