PRTU | పీఆర్సీ ప్రకటించకపోతే ఉద్యమమే : పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
PRTU | రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించి, పెండింగ్‌లో ఉన్న డీఏలను ఒకేసారి విడుదల చేయాలని పీఆర్టీయూటీఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు వై. జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఊట్కూర్ : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ( PRC ) ని ప్రకటించి, పెండింగ్‌లో ఉన్న డీఏలను ఒకేసారి విడుదల చేయాలని పీఆర్టీయూటీఎస్ ( PRTU ) నారాయణపేట జిల్లా అధ్యక్షుడు వై. జనార్దన్‌రెడ్డి ( Janardhan Reddy ) డిమాండ్ చేశారు. గురువారం పీఆర్టీయూటీఎస్ ఊట్కూర్ మండల శాఖ అధ్యక్షుడు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి కే. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు పలు పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేయాలని, పీఆర్సీతో పాటు పెండింగ్ డీఏలను ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాలకు సిద్ధం కావాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. హెల్త్ కార్డులపై అపోహలు అవసరం లేదని, ట్రస్ట్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.
కార్యక్రమంలో మండల విద్యాధికారి మాధవి, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కుసుమ, మండల గౌరవ అధ్యక్షుడు ఫజల్, జిల్లా నాయకులు భాస్కర్, వెంకటేష్ గౌడ్, ఆనంద్, సాయప్ప, మహేష్, రాములు, అబ్దుల్ సలాం, ఆంజనేయులు, గురునాథ్, పద్మావతి, నారాయణ, రామచంద్రరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

