మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 22 : మా బలం, బలగం బీఆర్ఏస్ సైన్యమేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నియోజకర్గంలోని బీఆర్ఏస్ బూత్ ఇన్చార్జీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ పార్టీకి లేనంత కార్యకర్తలున్న పార్టీ బీఆర్ఏస్ అని గర్వంగా చెప్పుకుంటామన్నారు. క్రమశిక్షణ గల బీఆర్ఏస్ పార్టీ పైనికులు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమయ్యేలా ఎంతో కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. పదేండ్లలోనే 60ఏండ్ల అభివృద్ధి సాధించామని, ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేశామన్నారు. మరోసారి అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని మరింత విస్తృతంగా ప్రజలకు తెలియజేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. క్షేత్రస్థాయిలో మిగతా పార్టీల నేతలకు కనీసం ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి ఉందని, అయినప్పటికీ పోలింగ్ వరకు పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్, సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శంతన్నయాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహ్మాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాలు ఖాళీ..
అధికార బీఆర్ఎస్ పార్టీ హవాతో ప్రతిపక్ష పార్టీలు ఖాళీ అయిపోయాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హన్వాడ మండలం టంకరకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, రమేశ్, వేపూరు మల్లేశ్, నారాయణ, ఆంజనేయులు, వెంకటయ్య, నాగరాజు, చాన్న రాములు, కేశవులుతోపాటు 100మందికిపైగా మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అబ్దుల్ఖాదర్దర్గాలో ప్రార్థనలు..
జిల్లా కే్ంరద్రంలోని అబ్దుల్‌ఖాదర్ ద ర్గాలో శనివారం రాత్రి నిర్వహించిన నా తే మహిఫిల్ కార్యక్రమానికి మంత్రి శ్రీ నివాస్‌గౌడ్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చై ర్మన్ అబ్దుల్ రహెమాన్, దర్గా ప్రతినిధి జమీర్, నాయకులు సమాద్ఖాన్, సుల్తాన్, వాజిద్, ఎజాజ్ పాల్గొన్నారు.
ఉన్నత విద్య అందించడమే లక్ష్యం..
అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యునివర్సిటీల్లో ఉన్నత విద్యతోపాటు స్కాలర్షిప్, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రతి సంవత్సరం మహబూబ్‌నగర్‌లో నిర్వహింఏందుకు పూర్తి సహకారం అందిస్తామ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లోని సుదర్శన్ కన్వెన్షన్హాల్లో ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్ ఫస్ట్ ఎవర్ బిగ్గెస్ట్ స్టడీ అబ్రాడ్ ఫెయిర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ వన్ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌కు చెందిన యువత విదేశాల్లో విద్యనభ్యసించడం కోసం శాంత నారాయణగౌడ్ చారిటబుల్ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన స్కిల్, డెవలప్మెంట్ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. యువతకు విదేశాల్లో చదువుకునేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా అవగాహన కార్యక్రమాలను శాంతనారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. మహబూబ్‌నగర్‌కు అంతర్జాతీయ స్థాయి కంపెనీలు తరలి వస్తున్నాయని, అమరరాజా కంపెనీతో 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామన్నారు. జేఎన్న్టీయూ ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతిక ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఫెయిర్‌లో పాల్గొనడానికి వచ్చిన యునివర్సిటీల ప్రతినిధులు, నిర్వాహకులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఫెయిర్ నిర్వాహకులు వంశీవినయ్, అంకిత్‌జైన్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు..
జిల్లా కేంద్రంలోని కొత్తగంజి చౌరస్తా, బీఎన్ రెడ్డి కాలనీలో, ధనలక్ష్మీకాలనీ ఆంజనేయస్వామి ఆలయంలో దుర్గామాతకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పూజలు చేశారు. అదేవిధంగా ప్రేమ్‌నగర్ బెస్ల సంఘం కమ్యూనిటీ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. అంతకుముందు అప్పన్నపల్లిలోని గణేశ్ మండపంలో శివమారుతి భజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడుగుల భజన, అందెల పూజా కార్యాక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పన్నపల్లి బ్రిడ్జీని శరవేగంగా పూర్తి చేసామన్నారు.
నీలికుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం..
జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో నీలికుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కాళికాదేవి, మహాకాళేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు.
మా కాలనీలో వేరే పార్టీకి చోటులేదు..
మా కాలనీలో వేరే పార్టీకి చోటులేదని.. కారు గుర్తుకు ఓటేసి శ్రీనివాస్‌గౌడ్‌ను గెలిపించుకుంటామని ఆదివారం జిల్లా కేంద్రంలోని కేటీఆర్ నగర్ (డబుల్బెడ్రూం కాలనీ) కాలనీవాసులు తీర్మానం చేశారు. రాబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధికి పట్టం కట్టేందుకు కాలనీవాసులంతా ఒకే మాటపై నిలుస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శివరాజ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, డబుల్బెడ్రూం కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.