మహబూబ్‌నగర్, డిసెంబర్ 24 : మూగజీవాలను హింసిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన మూగజీవాలపై క్రూర త్వ నిరోధక జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మా ట్లాడారు. మూగజీవాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్రూరత్వాన్ని ప్రదర్శించవద్దని తెలిపారు. ఇందుకోసం సంతలు జరిగే ప్రదేశాల్లో రెవెన్యూ, పోలీసు, పశుసంవర్ధకశాఖల సమన్వయం తో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
జంతువులపై చోటుచేసుకున్న ఘటనలు బాధాకరమైనవని, ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందన్నారు. జంతువులను ఎవరైనా హిం సిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మండలస్థాయిలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించడం, భూతదయ కలిగి ఉండే లా సాంస్కృతిక సారథి కళాకారులు, పోలీస్ కళాజాతతో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎక్కడైనా జంతువులపై క్రూరత్వం ప్రదర్శిస్తే బాధ్యులతోపాటు సంబంధిత ప్రాంతానికి చెందిన అధికారులను కూడా బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.
సమావేశంలో కమిటీ కన్వీనర్, పశు సంవర్ధకశాఖ జిల్లా అధికారి మధుసూదన్‌గౌడ్, డీపీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో జ్యోతి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, సమాచారశాఖ సహాయ సంచాలకుడు వెంకటేశ్వ ర్లు, మార్కెటింగ్‌శాఖ అధికారి సారిక, ఆర్టీవో నరేశ్‌కుమార్, విద్యాశాఖ అధికారి బాలుయాదవ్, సీఐ ప్రవీణ్‌కుమార్, డీసీఆర్బీ వరలక్ష్మి, గోశాల ముకుందారెడ్డి ఉన్నారు.