కొత్తకోట రూరల్, జూలై 6 : సర్ కార్యక్రమంపై ప్రజలకు సొంతంగా అవగాహన వచ్చేలా ప్రతి ఒక్కరూ పార్టీ తరపున సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం కొత్తకోట మండలం భూత్కూర్‌లో సర్‌పై బీఎల్ఏలతో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అదే సమయంలో కేటీఆర్ సైతం సైల్లో లైన్లోకి వచ్చి పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు మండలంలోని ప్రతి పల్లె, గ్రామాలకు స్వయంగా తిరుగుతూ సర్ కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. పార్టీశ్రేణులు అప్రమత్తంగా ఉంటూ అర్హు ల పేర్లు గల్లంతు కాకుండా చూడాలన్నా రు.
అనంతరం ఆల మాట్లాడుతూ సర్‌పై పార్టీ శ్రేణు లు, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ శ్రేణులకు సర్ కార్యక్రమం నిర్వహణ ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ముఖ్యం గా ఓటరు జాబితాలో బీఆర్ఎస్ శ్రేణులు, మద్దతుదారుల పేర్లు తొలగించకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని, అదే సమయంలో బీఆర్ఎస్కు మద్దతు తెలిపే యువతీ యువకులతో కొత్తగా ఓటరు నమోదు చేయించాలని సూచించారు. అనంతరం గ్రామంలో జరిగిన పలు శుభకార్యాలయాల్లో ఆల పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, మాజీ సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, గాడిల ప్రశాంత్, నెహ్రూతోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.