కోస్గి : పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న ఆధార్ కేంద్ర నిర్వాహకులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం నుంచి ప్రజలు ఆధార్ కోసం అక్కడికి వెళ్లి పడిగాపులు కాస్తున్నారు. ఒక సమయం అంటూ లేకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే తంతు కొనసాగుతున్న ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదని వాపోతున్నారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఈ ఆధార్ సెంటర్ ఉన్న కూడా వారికి కూడా కనిపించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Neem Leaves | వేపాకులను రోజూ పరగడుపునే తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?
Donkey Milk | గాడిద పాలకు భలే డిమాండ్.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చి సంగారెడ్డి జిల్లాలో వ్యాపారం
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌కు బోయింగ్ నిపుణులు.. దొరికిన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్