Nagarkurnool | బిజినేపల్లి, మార్చి 18 : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో ఓ మహిళ ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిజినేపల్లికి చెందిన లక్ష్మి (48) మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరు లేనప్పుడు తన ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పు పట్టించుకున్నట్లు స్థానికులు తెలిపారు. చుట్టుపక్కల వారు గమనించేసరికే ఇంట్లో మంటలు ఎగిసిపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు కూడా ఆర్పడం జరిగిందన్నారు. ఈ ఘటనపై కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఏఎస్సై సయ్యద్ అలీ తెలిపారు.