జడ్చర్ల టౌన్, జూన్ 30 : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చ ర్ల, మిడ్జిల్ గులాబీమయంగా మారింది. మంగళవారం మా జీ మంత్రి హరీశ్‌రావు పర్యటన విజయవంతమైంది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరై శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మిడ్జిల్‌లో గులాబీ శ్రేణులతో కలిసి ముఖ్య నాయకులు పాల్గొని తెలంగాణ ఉద్యమకారుడు మన్యం వెంకట్‌రెడ్డి విగ్రహావిష్కరణ చే శారు.
ఆ తర్వాత కొత్తపల్లి వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను హరీశ్‌రావు ఎగురవేశారు. అక్కడి నుంచి నేరుగా జ డ్చర్ల పట్టణంలోని వాసవీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మ హమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు కార్పొరేషన్ల మాజీ చైర్మ న్లు, పలువురు నాయకులు హాజరవడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొన్నది.
కదిలిన గులాబీ సైన్యం
జడ్చర్లలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ని యోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణు లు తరలివచ్చారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రసంగిస్తున్న క్రమంలో కాంగ్రె స్ సర్కా రు నిర్లక్ష్యం.. సీఎం రేవంత్‌రెడ్డి చేతగాని తనంపై ప్రస్తావిస్తుండగా శ్రేణులు ఈల లు, కేకలతో హోరేత్తించారు. అలాగే ప్రభుత్వ వైఫల్యం, సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై వేసిన ఓట్లు వేసిన వీడియోలను భారీ స్క్రీన్‌పై ప్రజెంటేషన్ రూపంలో వివరించడం ఆకట్టుకున్నది. బీఆర్ఎస్ శ్రేణు లు జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు చేశా రు. బీఆర్ఎస్ నాయకుడు శ్రీశైలం యాదవ్ జన్మదినం సందర్భంగా వేదికపై మాజీ మంత్రి హరీశ్‌రావు కేక్ కట్ చేసి తినిపించారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలసి సెల్ఫీ దిగారు.
మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పొగిడిన హరీశ్
‘కేసీఆర్ గారికి, మా అందరికీ ఇష్టమైన నాయకుడు డాక్టర్ లక్ష్మారెడ్డి గారూ’.. అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సర్పంచ్ పదవికే రాజీనామా చేయాలంటే ఆలోచిస్తారు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రాజీనామా చేయమంటే పార్టీలు మారే పరిస్థితి ఉంటుంది.. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. పొత్తులో భాగంగా టికెట్ రాకపోయినా.. ప్రలోభాలకు లొంగకుండా మహబూబ్‌నగర్ ఎంపీగా కేసీఆర్ గారి గెలుపు కోసం పనిచేశారని, పార్టీకి, కేసీఆర్ గారి పట్ల నిబద్ధత, నిజాయితీకి మారుపేరు లక్ష్మారెడ్డి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.