మహబూబ్నగర్ : రాష్ట్రంలో వీధికుక్కలు(Stray Dogs) స్వైరవిహారం చేస్తున్నాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా మహబూబ్నగర్ జిల్లా అయిజ పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ సమీపంలోని ఇంటి ముందు తోటి పిల్లలతో ఆడుకుంటున్న ఆరేళ్ల సుబ్బారాయుడు అనే బాలుడు కుక్కకాటుకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని మెరుగైన చికిత్స కోసం గద్వాలకు తరలించారు. కాగా, వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
England cricketers: ఫుల్లుగా తాగిన బెన్ డక్కెట్.. దర్యాప్తు చేపట్టనున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
Ghatkesar | భార్య విడాకుల నోటీసు పంపిందని.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య
Libya Army Chief | తుర్కియేలో కూలిన ప్రైవేట్ జెట్.. లిబియా ఆర్మీ చీఫ్ మృతి