England cricketers: ఫుల్లుగా తాగిన బెన్ డక్కెట్.. దర్యాప్తు చేపట్టనున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
England cricketers: ఇంగ్లండ్ క్రికెటర్లు ఫుల్లుగా బీర్లు తాగేశారు. రెండో, మూడవ టెస్టు మధ్య తప్పతాగారు. బెన్ డక్కెట్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టనున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చెప్పింది.
మెల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ క్రికెటర్లు(England cricketers) ఫుల్లుగా బీర్లు తాగిన ఘటన వైరల్ అవుతున్నది. ఈ ఘటనపై ఆ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ స్పందించారు. క్రికెటర్ల ప్రవర్తన గురించి దర్యాప్తు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయితే రెండవ, మూడవ టెస్టు మధ్య వరుసగా ఆరు రోజుల పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు మద్యం సేవించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్రిస్బేన్ సమీపంలో ఉన్న రిసార్టు పట్టణం నూసాలో ఇంగ్లండ్ ప్లేయర్లు తాగి తందనాలు ఆడినట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డక్కెట్ తాగిన మైకంలో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా పోయింది. ఫుల్లు కిక్కులో రోడ్డు మీదకు వచ్చిన డక్కెట్‌ను ఓ మహిళ ఇంటర్వ్యూ చేసింది. హోటల్‌కు వెళ్లాలంటే ఎలా వెళ్లాలో తనకు తెలియదని డక్కెట్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన మరో క్రికెటర్ జాకబ్ బేతల్ కూడా తప్పతాగినట్లు ఓ వీడియో వైరల్ అయ్యింది.
What is this behaviour from Ben Duckett😭😭. He was completely out of his mind after drinking a lot. Disappointing Attitude. We need to be serious. pic.twitter.com/KVsCbv73jX
— Aryan Goel (@Aryan42832Goel) December 23, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

