Ghatkesar | విడాకుల కోసం భార్య నోటీసులు పంపించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఘట్కేసర్ మండలం ఎదులాబాద్‌కు చెందిన వెంకటేశ్(40)కు కీసరకు చెందిన మౌనిక అలియాస్ విజయలక్ష్మీతో 2019లో వివాహం జరిగింది. వెంకటేశ్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. మౌనిక కీసర గురుకుల పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తుంది. వీరికి వివాహం జరిగిన ఆరేళ్లు అవుతున్నా ఇంకా సంతానం కలగలేదు. దీంతో కొంతకాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విడాకుల కోసం మౌనిక కోర్టు నోటీసులు పంపించింది. విడాకుల నోటీసులను చూసి వెంకటేశ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.