Bus Accident | నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని మణికంఠ జూనియర్ కళాశాలకు చెందిన కాలేజ్ బస్ బాలబాలికలతో విహారయాత్రలో భాగంగా హైదరాబాద్‌లోని జల విహార్‌కు వెళ్తున్న సమయంలో మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దయపల్లి గ్రామ శివారులో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ముందుగా వెళ్తున్న ఓ కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, దానిని తప్పించబోయే క్రమంలో కాలేజ్ బస్ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా పడ్డది.
ఈ బస్సులో మొత్తం 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తుండగా, అందులో 10 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం సమాచారం అందిన వెంటనే మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనను మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డీ జానకి, ఐపీఎస్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్ , బాలానగర్ ఎస్ఐలు స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
గాయపడిన విద్యార్థులను వెంటనే చికిత్స కోసం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతోపాటు, ప్రమాద స్థలంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా వేగంగా క్లియర్ చేయడం జరిగింది. పోలీసుల తక్షణ చర్యలు, సమర్థవంతమైన నిర్వహణ వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.


Jagadish Reddy | రేవంత్‌రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు : జగదీశ్‌రెడ్డి
Bus overturns | మహబూబ్‌నగర్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు : వీడియో
Hrithik Roshan | పెళ్లి వేడుకలో కుమారులతో కలిసి స్టెప్పులేసిన హృతిక్ రోషన్… వీడియో వైరల్