మహబూబ్‌నగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండో విడుత పంచాయతీ ఎన్నికల్లో కూడా పల్లెజనం బీఆర్ఎస్కు జై కొట్టింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా పంచాయతీల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. నారాయణపేట మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి జి ల్లాల్లో కూడా అదే జోరు కొనసాగింది. అధికార పా ర్టీకి పల్లె జనం చుక్కలు చూపెట్టారు. ప్రలోభాలకు గురిచేసిన తమ గుండెల్లో గులాబీ జెండా ఉందని నిరూపించారు.
దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యే ల సొంత ఊర్లలో పరా భవం ఎదురైంది. ఇక మి గతా చోట్ల హోరాహో రీగా పోటీపడ్డారు. అనేక చోట్లా స్వల్ప ఓట్ల తేడా తో బీఆర్ఎస్ మద్దతుదారులు ఓటమి చవిచూ డడం కనిపి ంచింది. చాలా చోట్ల రీ కౌం టింగ్ నిర్వహించారు. మ రో సారి మాజీ మంత్రు లు శ్రీనివాస్‌గౌడ్, నిర ంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి లు చక్రం తిప్పా రు. గద్వాల జిల్లాలో అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విజయు డు మంత్రాంగం ఫలించింది. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా రెండో విడుతలలో
519 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్ని కల్లో దాదాపు 250కు పైగా స్థానాలను బీఆర్ఎస్ మద్ద తుదారులు గెలుపొందడం చూస్తుంటే గులాబీ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజి పేట మండలం మర్రి జనార్దన్‌రెడ్డి సొంతూరు నేరెళ్లపల్లిలో, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి స్వగ్రా మం కోయిల కొండ మండలం శేరి వెంకటాపూర్‌లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి స్వగ్రామం ఆవంచలో బీఆర్ఎస్ మద్దతు దారులు గెలుపొందారు. తిమ్మాజి పేట మండలంలో ఆవంచ గ్రామంలో పార్టీ బలపరి చిన అభ్యర్థి చంద్ర కళా మోహన్‌రెడ్డి 480 ఓట్లతో విజయం సాధించారు. నేరేళ్లపల్లి గ్రామంలో మీసాల పుష్ప గెలుపొందారు.
కోయిలకొండ మండలం శేరి వెంకటా పూర్లో రాజేశ్వ ర్ 86 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాజేందర్‌రెడ్డి సొంతూరులో సంబురాలు బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి సొంత గ్రామ మైన మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం షేరివె ంకటాపురం జీపీపై గులాబీ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వర్‌కు 436 ఓట్లు రాగా.. తన సమీప కాంగ్రెస్ బలపరిచిన నర్సింహులుకు 350 ఓట్లు రాగా 86 ఓట్ల తేడాతో రాజేశ్వర్ గెలుపొందారు.
మర్రి సొంత ఇలాకాలో ప్రభంజనం నాగర్‌కర్నూల్ జిల్లాలో తొలి విడుత ఎన్నికల్లో ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డికే చుక్కలు చూపించిన నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి రెండో విడతలో సొంత నియోజక వర్గంలో సత్తా చాటారు. నియోజక వర్గంలో రెండో విడుతతో ఏకంగా కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. సొంత మండలంలో మర్రి తిరుగులేని ఆధిపత్యాన్ని
సాధించారు. తిమ్మాజిపేట మండలంలో 24 గ్రామపంచాయతీలో ఏకంగా 15 గ్రామపంచాయతీల్లో గులాబీ ప్రభంజనం సృష్టించారు. మేజర్ గ్రామపంచాయతీలైన తిమ్మాజిపేట, పాలెం పంచాయతీలను కైవసం చేసుకున్నారు. మర్రి జనార్దన్‌రెడ్డి సొంత గ్రామంలో మీసాల పుష్ప 408 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ను మట్టి కరిపించింది. తిమ్మాజిపేట మండలంలో గోరిట గ్రామంలో టాస్‌లో బీఆర్ఎస్ ఓడిపోయింది. స్వల్ప ఓట్ల తేడాతో దాదాపు పది పంచాయతీలను కోల్పోయారు.
నియోజకవర్గం మొత్తంలో మర్రి జనార్దన్‌రెడ్డి తనదైన శైలిలో హవా సృష్టించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తండ్రి కొడుకులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలుగా ఉన్నా నియోజకవర్గంలో మర్రి సునామీకి కొట్టుకుపోయారు. నియోజకవర్గంలో ఘోర పరాజయం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారింది. అలాగే మరికల్ మండలం పెద్ద చింతకుంటలో ఒక ఓటుతో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఓటమి చెందారు. కాంగ్రెస్ మద్దతుదారురాలు తిరుపతమ్మకు 605 ఓట్లు, బీఆర్ఎస్ బలపరిచిన పద్మమ్మకు 604 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 531 ఓట్లు వచ్చాయి. దేవరకద్ర నియోజకవర్గంలో కూడా ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణపేట నియోజకవర్గంలో రాజేందర్‌రెడ్డిలు నువ్వా నేనా అనే రీతిలో కాంగ్రెస్‌తో పోటీపడ్డారు. బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించడంలో సఫలీకృతమయ్యారు. మొత్తానికి రెండో విడుత ఎన్నికల్లో కూడా కారు జోరు కనిపించింది.
పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి దెబ్బతీశాయి. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి స్వగ్రామం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి పావని కృష్ణయ్యశెట్టి 124 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ గ్రామంలో బీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున సంబురాలు జరుపుకొన్నారు. కాంగ్రెస్ నేతలు ఇండ్లకే పరిమితం కావడం.. ఎమ్మెల్యే పత్తాలేకుండా పోవడం కనిపించింది. అలాగే నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి స్వగ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలుపొందడం విశేషం. నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి స్వగ్రామంలో కూడా బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి మురారి 444 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
కొల్లాపూర్, డిసెంబర్ 14 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవె ల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి రికార్డ్ విజయాన్ని అందుకున్నది. గులాబీ పార్టీ మద్దతుదారు రాలిగా చిట్టెమ్మ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలవగా.. ఆదివారం జరిగిన పోలింగ్, కౌంటింగ్‌లో ప్రత్యర్థిపై 1572 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది.