తాడూరు, మార్చి 5 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. దీంతో పార్టీ మరింత పటిష్టంగా మారుతున్నదని తెలిపారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం తాడూరు మండలం సిర్సవాడ, ఎట్టిధర్పల్లి గ్రామాలకు చెందిన 60 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు మర్రి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. సిర్సవాడకు చెందిన బీజేపీ నాయకులు విష్ణు, హుస్సేన్, శ్రీశైలం, బాలరాజు, రమేశ్, శ్రీనుగౌడ్, శ్రీశైలం, నరేశ్‌గౌడ్, దస్తగిరితోపాటు 45 మంది యువకులు పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా పార్టీలో చేరే వారితో పాత క్యాడర్ కలిసి ఉండాలని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అందరి సహకారంతో నాగర్‌కర్నూల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
పాలెం గ్రామానికి చెందిన 30 మంది..
బిజినేపల్లి, మార్చి 5 : మండలంలోని పాలెం గ్రా మానికి చెందిన 30 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకు లు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. గ్రామానికి చెం దిన చంద్రశేఖర్, శ్రీకాంత్తోసహా 30 మంది యువకులకు ఎమ్మెల్యే మర్రి తన నివాసంలో గులాబీ కండువాలు కప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు యాదవరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వెంకటేశ్, రవీందర్‌రెడ్డి, రామకృష్ణ, శివ తదితరులున్నారు.
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
మహ్మదాబాద్, మార్చి 5 : బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అ న్నారు. ఆదివారం మండలంలోని నంచర్ల, ముకర్లబా ద్, కంచన్‌పల్లి, చిన్నాయిపల్లి, శేక్‌పల్లి గ్రామాలకు చెం దిన 100 మంది నాయకులు గులాబీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్‌రెడ్డితోపాటు పలువురు చేరిన వారిలో ఉన్నారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఆఖరి రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధిలో ప రుగులు పెడుతున్నదన్నారు. దీంతో దేశంలోనే నాలు గో స్థానంలో నిలిచిందని చెప్పారు. మన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. అందుకే బీఆర్ఎస్కు పలువురు ఆకర్షితులవుతున్నారని చెప్పా రు. పార్టీశ్రేణులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.
పార్టీలో చేరిన వారికి స్వాగతం పలుకుతూ కొత్త, పాత అన్న బేధం లేకుండా అందరూ కుటుంబీకుల్లా కలిసి మెలిసి ఉండాలని సూచించారు. దేశంలో, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం ఖాయమన్నా రు. అనంతరం అశోక్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి ఆ కర్షితులై, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిపై ఉన్న గౌరవంతో బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. మండలంలో పార్టీకి తిరుగులేకుండా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీసీఎస్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, మాజీ ఎంపీపీలు సంజీవరెడ్డి, అలవేలు, అనురాధ, సర్పంచులు పార్వతమ్మ, వెంకట్రాంరెడ్డి, రాఘవేందర్, ఖాజాహజీబొద్దీన్, అం జయ్య, గీత, ఎంపీటీసీ చెన్నయ్య, బీఆర్ఎస్ మండలా ధ్యక్షులు భిక్షపతి, పెంట్యానాయక్, నాయకులున్నారు.