నవాబ్‌పేట, అక్టోబర్ 21 : నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్న బీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజార్టీని అందించాలని బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు. తిరుమల హిల్స్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేశవరావుపల్లికి చెందిన కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రవితోపాటు 25 మంది, చెన్నారెడ్డిపల్లికి చెందిన 20 మంది నాయకులు కార్యకర్తలు శనివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన పదేండ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో నర్సింహులు, సర్పంచులు రజిని, యాదయ్యయాదవ్, యూత్వింగ్ మండలాధ్యక్షుడు శ్రీను, నాయకులు శ్రీనివాస్‌యాదవ్, అంజయ్య, జైపాల్‌యాదవ్, రాజు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.