అచ్చంపేట, ఏప్రిల్ 1: వచ్చే రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖా యమైపోయిందని, కార్యకర్తలను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధంగా ఉన్నామని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
బుధవారం అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజీపూర్ గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ చంద్రమౌళి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మర్రి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ల సమక్షంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి మర్రి, ఆర్ఎస్పీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోకల మనోహర్, అమీనోద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పర్వతాలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు తులసీరాం, నర్సింహాగౌడ్, శ్రీకాంత్ భీమా, శ్రీనివాస్ యాదవ్, నర్సయ్యయాదవ్, బండపల్లి వెంకటయ్య, రమేశ్‌రావు, వంశీ, బొడ్కనాయక్, నరేందర్‌రావు, శ్రీపతి రావు హాజీపూర్ గ్రామస్తులు విషువర్ధన్‌రెడ్డి, నిరంజన్, చంద్రయ్య, జగన్ పాల్గొన్నారు.