‘అభివృద్ధే నా జెండా.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ముందు వరుసలో నిలపాలన్నది నా లక్ష్యం.. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని జిల్లా అభివృద్ధికి వందశాతం పునాదులు వేశాను’..అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వనపర్తి పట్టణంలో మంత్రి నివాసంలో 4వ వార్డుకు చెందిన మునికుమార్, బాలరాజు ఆధ్వర్యంలో 30 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, అలాగే పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో మరో 30మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే పెద్ద మందడి మండలంలోని బలిజపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రగడ్డతండా వాసులు మంత్రి నిరంజన్‌రెడ్డికి సంపూర్ణంగా మద్దుతు ప్రకటిస్తున్నామని తీర్మానం చేశారు.
పెద్దమందడి, అక్టోబర్ 30 : రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల లిస్ట్‌లో వనపర్తిని ముందు వరుసలో నిలపాలన్నదే తన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 30మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సోమవారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ముందుగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, ప్రజలందరూ ఆశీర్వదిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేస్తానన్నారు. జిల్లా అభివృద్ధిలో అందరూ భా గస్వాములు కావాలన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముం దు జిల్లా అభివృద్ధిలో వెనుకబడి ఉండేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ సహకారంతో వి ద్య, వైద్యం, వ్యవసాయం, క్రీడలు, రోడ్లు తదితర వా టిని మెరుగుపర్చుకున్నామని పేర్కొన్నారు. నూతన దవాఖానలు, కళాశాలలు, నియోజకవర్గానికి సా గునీరు తీసుకొచ్చామని తెలిపారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేశానని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ గెలుపునకు ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పార్టీలో అందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను, మ్యానిఫెస్టోను వివరించాలన్నా రు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అ ధ్యక్షు డు జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజాప్రకాశ్రెడ్డి, మాజీ వైస్ ఎం పీపీ వెంకటయ్య, గ్రామ రైతు కమిటీ అధ్యక్షుడు చిన్న రఘువర్దన్‌రెడ్డి, చిత్తూరు కృష్ణారెడ్డి, గొంది భాస్కర్‌రెడ్డి, గట్లకానాపురం సర్పంచ్ కోట్ల వెంకటేశ్, చిట్టిబాబు, నా యకులు, కార్యకర్తలు, పార్టీలో చేరిన వారు ఉన్నారు.
వనపర్తి, అక్టోబర్ 30 : ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, వందశాతం అభివృద్ధికి పునాదులు వేశానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి నివాసంలో జిల్లా కేంద్రంలోని 4 వవార్డుకు చెందిన మునికుమార్, బాలరాజు ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 30మంది యువకులు, మహిళలు సోమవారం మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొమ్మిదిన్నరేండ్లుగా ప్రజలకు ఏమీ కావాలో గ్రహించి అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చామన్నారు. పనిచేస్తే ప్రజలు గుండెలో పెట్టుకుంటారన్న దానికి ఈ చేరికలే నిదర్శమన్నారు. పట్టణంతోపాటు చుట్టూ ఉన్న గ్రామా లను కూడా పట్టణ స్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. వనపర్తిని జిల్లాగా సాధించుకోవడంతో పట్టణాభివృద్ధికి శరవేగంగా విస్తరించిందని, అందుకు తగ్గట్టుగా అభివృద్ధి కార్యక్రమాలకు పునాదులు వేశామన్నారు. పట్టణంలోని యువత ఎక్కడికో వెళ్లి ఉపాధి చేసుకొనే పరిస్థితుల నుంచి నేడు తమ స్థాయికి తగ్గ ఉపాధిని ఇక్కడే చేసుకొనే స్థాయికి వచ్చారన్నారు.
ఎన్నికలు ఐదేండ్లకు ఒకసారి వస్తుంటాయి, కానీ చేసిన అభివృద్ధి ఎప్పటికీ నిలిచిపోతుందని, అది ఎప్పుడూ ప్రజల కండ్ల ఎదుట ఉంటుందని, అది చేసిన వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు. 30 ఏండ్లుగా నాయకులు వారి స్వలాభం, ఓట్ల కోసం జిల్లా కేంద్రంలో రోడ్డు వెడల్పు పనులు చేపట్టలేకపోయారన్నారు. తాను రోడ్ల వెడల్పు పనులు చేయించేటప్పుడు చాలా మంది వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు పడుతారని గుర్తు చేశారు. అయినా వాటిన్నింటినీ లెక్క చేయకుండా రోడ్ల వెంట ఇండ్లు కోల్పోతున్నవారితో చర్చించి వారికి న్యాయం చేసే దిశగా వారిని ఒప్పించి రోడ్ల విస్తరణతో పట్టణాభివృద్ధికి దోహదం అవుతుందని, నేను ఓట్ల రాజకీయం చేయ డం లేదని వారితో సూటిగా చెప్పడంతో సాధ్యమైందన్నారు. వీటిన్నింటిని ప్రజలు గుర్తించాలని, వచ్చే ఎన్నికల్లో చాలా మంది వాగ్ధానాలు చేస్తుంటారు.. మోసపూరిత మాటాలను చెబుతుంటారు. ప్రజలు వాటిని గుర్తించాలన్నారు. మనకండ్ల ముందున్న అభివృద్ధి చూసి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీ మెజార్టీని అందించాలని కోరారు. పార్టీలోకి వచ్చే వారు, కొత్త, పాత అనే తేడా లేకుండా పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. గెలిపించే బాధ్యత మీది..వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మార్కెట్ చైర్మన్ రమేశ్‌గౌడ్, కౌన్సిలర్లు బండారు కృష్ణ, కోఆఫ్షన్ సభ్యులు ఇమ్రాన్, రాము, రామస్వామి, సతీశ్ కుమార్, శివకుమార్, వెంకటేశ్, విజయ్, యాదగిరి, శ్రీకాంత్, భీమ్‌నాయక్, రమేశ్, దశరథమ్మ, అంజలి, సుజాత తదితరులు పాల్గొన్నారు.